India Extends Ban on International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు, మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న డీజీసీఏ, దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు
ఇంటర్నెషనల్ విమానాల రాకపోకలపై (India Extends Ban on International Flights) డీజీసీఏ ఇంతకుముందు విధించిన బ్యాన్ ఈ నెల 28తో ముగియనుంది.
Mumbai, Feb 27: కరోనా మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మరోసారి పొడిగించింది. ఇంటర్నెషనల్ విమానాల రాకపోకలపై (India Extends Ban on International Flights) డీజీసీఏ ఇంతకుముందు విధించిన బ్యాన్ ఈ నెల 28తో ముగియనుంది.
అయితే, తాజాగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం మరోసారి నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ డీజీసీఏ (Directorate General of Civil Aviation (DGCA) నిర్ణయం తీసుకుంది. కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక ఫ్లైట్స్‌కు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.
ప్రస్తుతం భారత్ సుమారు 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. ఈ దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు సాగించే విమానాలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం గతేడాది మార్చి 25 నుంచి పూర్తిగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిషేధించిన (DGCA Extends Ban on International Flights) విషయం తెలిసిందే.
అనంతరం మే 25 నుంచి డొమెస్టిక్ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, గత 11 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ అలాగే కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు నెల రోజుల పాటు ఈ నిషేధాన్ని పొడిగించడం గమనార్హం.