Digital Arrest: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10.61 కొట్టేసిన సైబర్ నేరగాళ్లు, హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడి నుండి డబ్బు దోచుకున్న కేటుగాళ్లు
వాట్సప్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.10.61 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడు(73) తనకు ఎలాంటి సంతానం లేకపోవడంతో డబ్బునంతా బ్యాంకులో జమ చేసుకున్నాడు.
Hyd, Oct 4: హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సప్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.10.61 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు.
హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడు(73) తనకు ఎలాంటి సంతానం లేకపోవడంతో డబ్బునంతా బ్యాంకులో జమ చేసుకున్నాడు.
అయితే ఈ సంవత్సరం జులై 8న ఆ వృద్ధుడికి సైబర్ మోసగాడు వాట్సప్ కాల్ చేసి, ముంబైలో తన పేరు మీద ఒక బ్యాంకు అకౌంట్ తెరిచారని, దాని మీద మనీలాండరింగ్ జరిగిందని ఆ వృద్ధుడిని భయపెట్టారు. అంతేకాకుండా వాట్సప్‌లో ఈడీ, ఐటీ విభాగాల పేరిట కొన్ని లేఖలు కూడా పంపించాడు.. తనకు ఈ మనీలాండరింగ్‌కి సంబంధం లేకుండా చేయాలంటే తాము చెప్పినట్టు వినాలని వృద్ధుడిని భయపెట్టారు.
మనీలాండరింగ్‌కి వీరికి సంబంధం లేదని తేలాలంటే తమ ఖాతాల్లోని డబ్బును అలానే హిందూ వివాహచట్టం ప్రకారం తన భార్య పేరిట ఉన్న ఖాతాలోని డబ్బును కూడా తమకు పంపాలని.. నేరంతో మీ డబ్బుకు సంబంధం లేదని మా దర్యాప్తులో తేలితే మూడే రోజుల్లో మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని, అవసరమైతే మేమే కోర్టుకు హాజరవుతామాని నమ్మించారు.
నిబంధనలను ఉల్లంఘిస్తే 3-7 ఏళ్ల శిక్ష తప్పదని, లేదంటే ఇప్పుడే పోలీసులు తమని అరెస్ట్ చేస్తారని భయపెట్టారు. దీంతో గత జులై 8 నుంచి 26 వరకు 11 విడతలుగా తమ ఖాతాల్లోని మొత్తం రూ.10,61,50,000లను నేరగాళ్లు సూచించిన ఖాతాల్లోకి వృద్ధుడు పంపించాడు.. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు కాల్ చేయడం మానేశారు. డిజిటల్ అరెస్ట్ స్కాం, నీ కూతురు సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుందని మహిళకు బెదిరింపులు, గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన బాధితురాలు
నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లోనే డబ్బును తిరిగి ఖాతాలకు బదిలీ చేస్తామని చెప్పి, రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో వృద్ధ దంపతులు టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఝాన్సీ, గోరఖ్పూర్, వారణాసి, బెంగళూరు, గురుగ్రామ్, బిహార్, మణిపుర్లలోని పలు ప్రాంతాలకు చెందిన ఖాతాలకు ఆ డబ్బు వెళ్లిందని గుర్తించారు.