IPL Auction 2025 Live

Dolo-650: డోలో-650 తయారీ సంస్థకు క్లీన్ చిట్, కరోనా సమయంలో డాక్టర్లకు రూ. వెయ్యికోట్లు ఇచ్చారనే వార్తలు నిజం కాదన్న ఐపీఏ, తాయిలాల పంపిణీ ఆరోపణల్లో మైక్రోల్యాబ్స్‌కు ఊరట

అనైతిక, తప్పుడు విధానాలను అనుసరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ సమాఖ్య గత నెలలో సుప్రీం కోర్టులో మైక్రోల్యాబ్స్ కు (Micro labs) వ్యతిరేకంగా పిటిషన్ వేయడం గమనార్హం.

New Delhi, SEP 10: సాధారణ జ్వరం, నొప్పి నివారణ ఔషధమైన డోలో 650 (Paracetamol) తయారీ సంస్థ, బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ కు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ (IPA) క్లీన్ చిట్ ఇచ్చింది. డోలో 650 (Dolo 650) మాత్రలను సిఫారసు చేసినందుకు గాను వైద్యులకు మైక్రోల్యాబ్స్ పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. రూ.1,000 కోట్ల వరకు ఇచ్చిందన్న వార్తలు రాగా, అసలు డోలో 650 విక్రయాలే అన్ని లేవని మైక్రోల్యాబ్స్ (Micro labs) ఖండించడం తెలిసిందే. దీనిపై ఒక నివేదికను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (కేంద్ర రసాయనాల శాఖ పరిధిలో), నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)కి ఐపీఏ సమర్పించింది.

Boy Thrashed in MP: మధ్యప్రదేశ్‌ జైన్ ఆలయంలో దారుణం, బాలుడ్ని కట్టేసి కొట్టిన ఇద్దరు వ్యక్తులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో 

ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ విధానాల మార్గదర్శకాలను మైక్రోల్యాబ్స్ అనుసరించినట్టు తన నివేదికలో ఐపీఏ తెలిపింది. అనైతిక, తప్పుడు విధానాలను అనుసరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ సమాఖ్య గత నెలలో సుప్రీం కోర్టులో మైక్రోల్యాబ్స్ కు (Micro labs) వ్యతిరేకంగా పిటిషన్ వేయడం గమనార్హం.

Myntra Jobs: ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం మింత్రాలో 16000 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 

మైక్రోల్యాబ్స్ వైద్యులకు రూ.1,000 కోట్ల ఉచిత తాయిలాలు ఇచ్చినట్టు ప్రత్యక్ష పన్నుల మండలి ఆరోపించడాన్ని పిటిషన్ లో ప్రస్తావించింది. దీన్ని ఐపీఏ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. ఒక ఏడాదిలో ఒక్క డోలో 650 బ్రాండ్ పై ఉచితాల కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పడం అసమంజసం’’ అని పేర్కొంది.