Domestic LPG with QR Code: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్, ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్
కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లను క్యూఆర్‌కోడ్‌తో మెటల్ స్టిక్కర్‌ను అందించనున్నట్లు తెలిపారు.
New Delhi, Nov 17: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది.ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేయనుంది. కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లను క్యూఆర్‌కోడ్‌తో మెటల్ స్టిక్కర్‌ను అందించనున్నట్లు తెలిపారు. దీంతో స్మార్ట్‌ఫోన్‌తో గ్యాస్ సిలిండర్‌కున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీ గ్యాస్ ఏ ఏజెన్సీ నుండి డెలివరీ అవుతుంది.
సిలిండర్‌లో గ్యాస్‌ను ఎక్కడ ఫిల్ చేశారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా?. సిలిండర్‌లో ఎన్ని కేజీల గ్యాస్ ఉంది. ఎప్పుడు, ఏ తేదీన డెలివరీ అవుతుందనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇలా క్యూఆర్‌కోడ్‌ను సిలిండర్లకు అమర్చడం ద్వారా..దొంగిలిస్తున్న గ్యాస్‌తో పాటు సిలిండర్ భద్రత, ఇతర గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ వంటి విషయాల సమాచారం వినియోగదారులకు అందించ వచ్చని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
Here's QR Code Video
ఈ ప్రాజెక్టు మూడు నెలల్లో పూర్తి కానుంది. క్యూఆర్ కోడ్ ప్రస్తుతం ఉన్న సిలిండర్లతో పాటు కొత్త సిలిండర్లకు క్యూఆర్ కోడ్ మెటల్ స్టిక్కర్‌ను అమర‍్చనున్నట్లు వెల్లడించారు.