Earphones Removed From Stomach: పికా డిజార్డర్‌ సమస్యతో ఇయర్‌‌ ఫోన్లతో సహా ఇనుము వస్తువులను తినేసిన ఓ వ్యక్తి, 3 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

పంజాబ్‌లోని మోగాలో రెండేళ్ల నుంచి క‌డుపు నొప్పి(Stomach Pain)తో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి క‌డుపులోంచి ఇయ‌ర్‌ఫోన్స్‌, వాష‌ర్స్‌, న‌ట్స్‌, బోల్టులు, వైర్లు, రాఖీలు, లాకెట్స్‌, బ‌ట‌న్స్‌, వ్రాప‌ర్స్, హెయిర్‌క్లిప్‌లు, జిప్ప‌ర్ ట్యాగ్‌, సెఫ్టీ ఫిన్‌లు డాక్టర్లు తొలగించారు.

Earphones, Lockets and Other Objects Removed From Stomach of Punjab Man Suffering From Pica, Know About the Eating Disorder

పంజాబ్‌లోని మోగాలో రెండేళ్ల నుంచి క‌డుపు నొప్పి(Stomach Pain)తో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి క‌డుపులోంచి ఇయ‌ర్‌ఫోన్స్‌, వాష‌ర్స్‌, న‌ట్స్‌, బోల్టులు, వైర్లు, రాఖీలు, లాకెట్స్‌, బ‌ట‌న్స్‌, వ్రాప‌ర్స్, హెయిర్‌క్లిప్‌లు, జిప్ప‌ర్ ట్యాగ్‌, సెఫ్టీ ఫిన్‌లు డాక్టర్లు తొలగించారు. ఇలాంటి కేసును ఆప‌రేట్ చేయ‌డం ఇదే తొలిసారి అని డాక్ట‌ర్ అజ్మీర్ క‌ల్రా తెలిపారు. ఆ పేషెంట్ శ‌రీరం నుంచి అన్ని వ‌స్తువుల్ని తీసివేసినా.. అత‌ని ఆరోగ్యం నిల‌క‌డ‌గా లేద‌న్నారు. ఖ‌నిజ వ‌స్తువులు చాన్నాళ్ల నుంచి అత‌ని క‌డుపులో ఉన్న కార‌ణంగా.. అత‌ని ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డిందని డాక్టర్లు తెలిపారు.

తినుబండారాల ప్యాకింగ్ కు న్యూస్ పేపర్ వాడొద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక.. ఆరోగ్య సమస్యలే కారణమని వెల్లడి

వివరాల్లోకెళితే.. తీవ్ర‌మైన జ్వ‌రం, క‌డుపు నొప్పితో పంజాబ్ లో 40 ఏళ్ల వ్య‌క్తి మోగాలోని మెడిసిటీ హాస్పిటల్‌కు వెళ్లాడు. నొప్పి ఎక్కువ‌గా ఉంద‌న‌డంతో.. అత‌నికి ఎక్స్ రే తీశారు. ఆ రిపోర్టు చూసిన డాక్ట‌ర్లు ఖంగుతిన్నారు. ఆ వ్య‌క్తి క‌డుపులో ఉన్న వ‌స్తువుల్ని చూసి షాక్ అయ్యారు. ఆ పేటెంట్ క‌డుపులో అన్నీ మెట‌ల్ వ‌స్తువులు ఉన్న‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. సుమారు మూడు గంట‌ల పాటు శ‌స్త్ర‌చికిత్స చేసి అత‌ని క‌డుపు నుంచి ఆ ఐట‌మ్స్ తీశారు.

Here's Video

ఆ పేషెంట్ క‌డుపులో ఇయ‌ర్‌ఫోన్స్‌, వాష‌ర్స్‌, న‌ట్స్‌, బోల్టులు, వైర్లు, రాఖీలు, లాకెట్స్‌, బ‌ట‌న్స్‌, వ్రాప‌ర్స్, హెయిర్‌క్లిప్‌లు, జిప్ప‌ర్ ట్యాగ్‌, సెఫ్టీ ఫిన్‌లు ఉన్న‌ట్లు గుర్తించారు. దాదాపు 3 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి డాక్టర్లు వ్యక్తి కడుపులోని వస్తువుల్ని తొలగించారు.డాక్లర్లు మాట్లాడుతూ..రోగి పికా డిజార్డర్‌తో బాధపడుతున్నారని సర్జన్ అనూప్ హండా, సర్జరీ చేసిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ విశ్వనూర్ కల్రా తెలిపారు.

పికా డిజార్డర్ అంటే ఏమిటి?

పికా అనేది తినే రుగ్మత, దీనిలో ఒక వ్యక్తి సాధారణంగా ఆహారంగా పరిగణించబడని వాటిని తింటాడు. పికా ఉన్న వ్యక్తి మంచు వంటి సాపేక్షంగా హానిచేయని వస్తువులను తినవచ్చు. లేదా వారు ఎండిన పెయింట్ లేదా మెటల్ ముక్కలు వంటి ప్రమాదకరమైన వస్తువులను తినవచ్చు. రుగ్మత సీసం విషం వంటి తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది.

పికాకు ఒక్క కారణం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో, స్కిజోఫ్రెనియా, అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) వంటి కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు పికాను కోపింగ్ మెకానిజమ్‌గా అభివృద్ధి చేయవచ్చు. అయితే ఇనుము, జింక్ లేదా మరొక పోషకంలో లోపం పికాతో సంబంధం కలిగి ఉంటుంది.