Maharashtra Home Minister Anil Deshmukh (Photo Credits: Twitter)

Mumbai, Nov 15: మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్ట‌య్యి ఈడీ విచార‌ణ ఎదుర్కొంటున్న మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. ఈ సంద‌ర్భంగా త‌న‌కు రోజూ ఇంటి భోజ‌నం తెప్పించుకునేందుకు అనుమ‌తించాల‌ని మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Maharashtra Ex-Home Minister AnIl Deshmukh) కోర్టును కోరారు. అయితే ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తోసిపుచ్చింది. ముందుగా జైలు కూడు తినండి (Eat Jail Food First). ఒక‌వేళ తిన‌లేక‌పోతే అప్పుడు మీ అభ్య‌ర్థ‌నను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది.

అయితే, త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా ఒక బెడ్ ఏర్పాటు చేయాల‌న్న అనిల్ దేశ్‌ముఖ్ అభ్య‌ర్థ‌న‌ను మాత్రం కోర్టు మ‌న్నించింది. ఆయ‌న‌కు కేటాయించిన గ‌దిలో బెడ్ ఏర్పాటుకు అనుమ‌తించింది. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈ నెల 2న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 12 గంట‌ల‌పాటు ముంబైలోని ఈడీ ఆఫీసులో అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్ర‌శ్నించిన అనంర‌తం ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కాగా, మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఈ ఏడాది ప్రారంభంలోనే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.



సంబంధిత వార్తలు

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ లీడర్‌ కే కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మే 7 వరకు పొడిగింపు

Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణను మే 15కి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు, ఆరోగ్యంపై వేసిన పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం

Arvind Kejriwal Eating Mangoes: బెయిల్ కోసం కేజ్రీవాల్ జైలులో మామిడిపండ్లు తింటున్నారు, ఢిల్లీ కోర్టుకు తెలిపిన ఈడీ, కేసు విచారణ శుక్రవారానికి వాయిదా

Mumbai Shocker: 18 నెల‌ల‌ కుమార్తెను చంపి శ్మ‌శానంలో పాతిపెట్టిన త‌ల్లిదండ్రులు, అజ్ఞాత వ్య‌క్తి రాసిన లేఖ‌తో బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం

Excise Policy Case: లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ సబబేనని తెలిపిన ధర్మాసనం

Hardik Pandya: జ‌ట్టు గెలుపుకోసం గుడిబాట ప‌ట్టిన కెప్టెన్, సోమ‌నాథ్ ఆల‌యంలో హార్ధిక్ పాండ్యా ప్ర‌త్యేక పూజ‌లు (వీడియో ఇదుగోండి)

జేబులో నుంచి ప‌ర్సు ప‌క్క‌న పెట్టి క్రికెట్ ఆడినందుకు రూ. 6.72 ల‌క్ష‌లు గాయ‌బ్, ముంబైలో క్ష‌ణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులు మాయం చేసిన కేటుగాళ్లు

IPL 2024 MI vs RR: ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు.. 6 వికెట్ల తేడాతో విజయం.. ముంబైకి వరుసగా మూడో ఓటమి.