Tejasvi Surya Booked For Violating MCC: బీజేపీ ఫైర్ బ్రాండ్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు, మతం పేరుతో ఓట్లు అడిగారంటూ ఈసీ సీరియస్
దేశంలో రెండోదశ ఎన్నికలు దాదాపు పూర్తయ్యాయి. ఈ సమయంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ అభ్యర్థి, తేజస్వి సూర్యపై కేసు (Tejasvi Surya) నమోదైంది. సూర్య మత ప్రాతిపదికన ఓట్లు అడిగి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల సంఘంగా కేసు నమోదు చేసింది.
Bangalore, April 26: దేశంలో రెండోదశ ఎన్నికలు దాదాపు పూర్తయ్యాయి. ఈ సమయంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ అభ్యర్థి, తేజస్వి సూర్యపై కేసు (Tejasvi Surya) నమోదైంది. సూర్య మత ప్రాతిపదికన ఓట్లు అడిగి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల సంఘంగా కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని కర్నాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
తేజస్వి సూర్యపై బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 123 (3) కింద కేసు నమోదైంది. మతం పేరుతో ఓట్లు అడగటం సూర్య చేసిన నేరమని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా.. వారి మీద ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే పలు జాతీయ పార్టీల కీలక నేతలపై కూడా ఈసీకి పిర్యాదులు అందాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement