Electoral Bonds Case: ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసులో SBI రిక్వెస్ట్‌ని తిరస్కరించిన సుప్రీంకోర్టు, రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు

మ‌రో మూడు వారాల్లో ఆ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు కోర్టుకు ఎస్బీఐ(SBI) తెలిపింది. భారతీయ స్టేట్‌ బ్యాంకు (SBI) అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర అసంతృప్తి చేసింది. రేపటి (మార్చి 12)లోగా విరాళాల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.

Supreme Court. (Photo Credits: Wikimedia Commons

New Delhi, Mar 11: ఎన్నిక‌ల బాండ్ల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ సాగింది. మ‌రో మూడు వారాల్లో ఆ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు కోర్టుకు ఎస్బీఐ(SBI) తెలిపింది. భారతీయ స్టేట్‌ బ్యాంకు (SBI) అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర అసంతృప్తి చేసింది. రేపటి (మార్చి 12)లోగా విరాళాల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.

గడువు పొడిగింపు ప్రసక్తే లేదని చెబుతూ.. రేపటిలోగా బాండ్ల వివరాలను (Electoral Bonds Case) కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఎస్‌బీఐకి స్పష్టం చేసింది. అలాగే.. మార్చి 15 లోగా బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీని ఆదేశించింది. స్టేట్‌బ్యాంకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించిందంటూ సీపీఎం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు SBI తీరుపై అసహనం ప్రదర్శించింది.

రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు, ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్‌బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్‌బీఐ సుప్రీంను ఆశ్రయించింది. దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపర్చామని, వాటిని మ్యాచ్‌ చేసి వివరాలను ఇచ్చేందుకు మరింత సమయం కావాలని బ్యాంకు తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

ఎన్నికల బాండ్ల అంశంలో ఎస్‌బీఐ అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు 26 రోజులపాటు ఏం చేశారని ప్రశ్నించింది. సీల్డ్ కవర్ తెరిచి వివరాలు సేకరించి ఈసీకి ఇస్తే చాలన్న సుప్రీంకోర్టు.. అసలు ఇప్పటివరకు స్టేట్‌బ్యాంక్‌ తీసుకున్న చర్యల వివరాలు పిటిషన్ లో లేవని తెలపింది. బాండ్ల వివరాలు వెల్లడించాలని తీర్పులోనే స్పష్టంగా చెప్పామని సుప్రీంకోర్టు తెలిపింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బీఐ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘‘గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని మేం ఆదేశించాం. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరకు రావడం చాలా తీవ్రమైన విషయం. మా తీర్పు స్పష్టంగా ఉంది. ఏ దాత నుంచి ఏ గ్రహీత ఎంత తీసుకున్నారన్న వివరాలను మ్యాచ్‌ చేసి మేం చెప్పమనలేదు.

ఎన్ని బాండ్లను జారీ చేశారన్న వివరాలను ఉన్నది ఉన్నట్లుగా ఈసీకి ఇవ్వమని ఆదేశించాం. గత 26 రోజులుగా దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఆ సమాచారమేదీ మీరు చెప్పలేదు. మార్చి 12 సాయంత్రం పనిగంటలు ముగిసేలోగా దాతల వివరాలను మీరు ఈసీకి అందజేయాల్సిందే’ అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆ వివరాలను బహిర్గతపర్చాలని ఈసీకి సూచించింది.