Odisha: వృద్ధురాలిపై పగబట్టిన ఏనుగు, అంత్యక్రియలు జరుగుతుండగా చితి మీద నుంచి శవాన్ని లాగిన ఏనుగు, అంతకుముందు ఆమెను చంపింది కూడా అదే ఏనుగు, వింత ప్రవర్తనతో భయాందోళనలో కుటుంబ సభ్యులు
ఏనుగు వింత ప్రవర్తనతో స్ధానికులు హడలి పోయారు. మయూర్ భంజ్ జిల్లాలోనిరాయ్‌పాల్ గ్రామంలో మాయాముర్ము అనే వృధ్దురాలు గురువారం గొట్టపు బావి నుంచి నీరు తీసుకుంటోంది. ఆసమయంలో సమీపంలోని దారి తప్పి బయటకు వచ్చిన ఏనుగు ఆ వృధ్ధురాలిపై దాడి చేసింది.
Odisha, June 13: ఒడిశా (Odisha) రాష్ట్రంలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు (Elephant)వింతగా ప్రవర్తించింది. ఒక వృధ్దురాలిపై దాడి చేసి చంపింది. ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అక్కడకూ వచ్చి చితిపై ఉన్న మృతదేహాన్ని (Dead Body) లాగి కింద పడేసి మరోసారి తొక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏనుగు (Elephant) వింత ప్రవర్తనతో స్ధానికులు హడలి పోయారు. మయూర్ భంజ్ జిల్లాలోని (Mayur Bhanj) రాయ్‌పాల్ గ్రామంలో మాయాముర్ము (70) అనే వృధ్దురాలు గురువారం ఉదయం గొట్టపు బావి నుంచి నీరు తీసుకుంటోంది. ఆసమయంలో సమీపంలోని దాల్మా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి దారి తప్పి బయటకు వచ్చిన ఏనుగు ఆ వృధ్ధురాలిపై దాడి చేసింది. కింద పడేసి తొక్కడంతో వృధ్దురాలు తీవ్రంగా గాయపడింది.
కుటుంబ సభ్యులు, స్ధానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించిందని రస్ గోవింద్ పూర్ పోలీసు స్టేషన్ ఇన్స్ పెక్టర్ లోపాముద్ర నాయక్ చెప్పారు.
అదేరోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు (Funeral) నిర్వహించటానికి స్మశానవాటికకు తీసుకు వెళ్లి చితి పేర్చి కార్యక్రమానికి సిధ్దమవుతున్నారు. ఇంతలో ఎటునుంచి వచ్చిందో ఉదయం దాడి చేసిన ఏనుగు మళ్ళీ స్మశానంలోకి వచ్చి చితిపై ఉన్నమాయాముర్ము మృతదేహాన్ని చితిపై నుంచి కిందకు లాగి.. కాళ్లతో తొక్కి..అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో భయపడిన స్ధానికులు, కుటుంబ సభ్యులు కొద్దిసేపటి తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.