Mamata calls Delhi meet: విపక్షాలను ఏకం చేస్తున్న మమతా బెనర్జీ, 22 మంది నేతలకు లేఖ, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిపై చర్చించే అవకాశం, సోనియా గాంధీ, సీఎం కేసీఆర్ సహా 19 పార్టీలకు ఆహ్వానం
West Bengal CM Mamata Banerjee. (Photo Credit: Facebook/Mamata Banerjee)

kolkata, June 12: రాష్ట్రపతి ఎన్నికలకు (Prez polls) షెడ్యూల్‌ విడుదలైన వేళ దేశ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee).. కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్​డీఏ కూటమి అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలతో సమావేశానికి రెడీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం మమతా బెనర్జీ భవిష్యత్తు కార్యాచరణకు ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలోనే మమత.. దేశంలోని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంయుక్త వ్యూహాన్ని రూపొందించేందుకు జూన్​ 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి వారిని హాజరుకావాలని మమతా బెనర్జీ లేఖలో కోరారు.

Anil Firojiya: కిలో బరువు తగ్గితే వెయ్యికోట్లు, ఉజ్జయిని ఎంపీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నియోజకవర్గం కోసం చమటోడ్చుతున్న అనిల్ ఫిరోజియా 

కాగా, జూన్​ 15న మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్​లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, 22 మంది విపక్ష నేతలు, సీఎంలకు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి (Sonia Gandhi) మమత లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR), ఎంకే స్టాలిన్​, ఉద్ధవ్​ ఠాక్రే(Uddav Thakrey), అరవింద్​ కేజ్రీవాల్​, నవీన్​ పట్నాయక్​, పినరయి విజయన్​, హేమంత్​ సొరెన్​, భగవంత్​ మాన్​లు ఉన్నారు.

Karnataka Shocker: బెంగుళూరులో దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని వివాహితపై యాసిడ్ పోసిన యువకుడు, కంటికి తీవ్ర గాయం  

8 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు స‌హా 22 మంది జాతీయ నేత‌ల‌కు మ‌మ‌త లేఖ రాశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల దృష్ట్యా విప‌క్షాల‌ను బెంగాల్ సీఎం కూడ‌గ‌డుతున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని బ‌రిలో నిలిపేందుకు మ‌మ‌త తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 15న ఢిల్లీలో నిర్వ‌హించే భేటీకి 22 మంది నేత‌ల‌కు ఆహ్వానం పంపారు.