Acid | Image used for representational purpose (Photo Credits: File Image)

Bengaluru, June 10: కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన (Karnataka Shocker) చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిన ముగ్గురు పిల్లల తల్లిపై ఒక వ్యక్తి యాసిడ్‌ (Man Throws Acid On Colleague) పోశాడు. ఈ ఘటనలో ఆమె కంటికి తీవ్ర గాయమైంది. ఆ మహిళను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త నుంచి విడాకులు పొందిన ఆమె, స్థానిక అగరబత్తి ఫ్యాక్టరీలో పని చేస్తున్నది. కాగా, అదే ఫ్యాక్టరీలో పని చేసే 36 ఏళ్ల అహ్మద్‌ అనే వ్యక్తితో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. మూడేళ్లగా వారిద్దరూ కలిసి అక్కడే పని చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని కొన్ని వారాలుగా అహ్మద్‌ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఆ మహిళ ( She Turns Down Proposal) నిరాకరించింది.దీంతో కక్ష పెంచుకున్న అతడు శుక్రవారం ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడు. ఆ మహిళ కుడి కంటికి గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అహ్మద్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముంబైలో తీవ్ర విషాదం, పక్షిని కాపాడబోయి ఇద్దరు మృతి, కళ్లు మూసుకుపోయి గుద్దేసిన ట్యాక్సీ డ్రైవర్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

వీరిద్దరూ దాదాపు మూడేళ్లుగా ఒకరికొకరు తెలుసని, అగరుబత్తీలు తయారు చేసే ఫ్యాక్టరీలో కలిసి పనిచేసేవారని పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితం బెంగళూరులో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని తమిళనాడులోని ఒక ఆశ్రమం నుండి అరెస్టు చేశారు, అక్కడ అతను దర్శనీయ వేషంలో నివసిస్తున్నాడు.