IPL Auction 2025 Live

Farmers’ Chakka Jam: కదిలేది లేదు..రోడ్ల పైనే వ్యవసాయం చేస్తాం, అక్టోబర్ 2 వరకు ఇక్కడే కూర్చుంటామని తేల్చి చెప్పిన రైతు సంఘాలు, గాంధీ జయంతి వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నామని వెల్లడి

దేశ వ్యాప్తంగా చక్కా జామ్‌ కు (Farmers’ Chakka Jam) విశేష మద్ధతు లభించింది. ఈ సంధర్భంగా రైతులు తాము ఇప్పట్లో ఇళ్లకు వెళ్లమని.. అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి వరకు (Centre has time till October 2) అక్కడే కూర్చుంటామని రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు

Rakesh Tikait Photo-ANI)

New Delhi, Feb 6: కొత్త వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ దేశ వ్యాప్తంగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. దేశ వ్యాప్తంగా చక్కా జామ్‌ కు (Farmers’ Chakka Jam) విశేష మద్ధతు లభించింది. ఈ సంధర్భంగా రైతులు తాము ఇప్పట్లో ఇళ్లకు వెళ్లమని.. అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి వరకు (Centre has time till October 2) అక్కడే కూర్చుంటామని రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు. చక్కా జామ్‌ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ- ఉత్తరప్రదేశ్‌ రహదారి ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో భారత్‌ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ (Rakesh Tikait) మాట్లాడారు.

ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో దురాక్రమణదారులు తమ ఉద్యమాన్ని హింసాత్మకం చేయాలని చూశారని ఆరోపణలు చేశారు. ఈ రహదారుల దిగ్బంధం ఈరోజుతో ముగిసేది కాదని.. అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి వరకు కొనసాగుతుందని రాకేశ్‌ ప్రకటించారు. అప్పటివరకు రోడ్లపైనే వ్యవసాయం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. రోడ్లను దున్ని వ్యవసాయం చేస్తామని స్పష్టం చేశారు. కాగా రైతుల పిలుపుతో ఉద్యమం తారా స్థాయికి చేరనుందనే వార్తలు వస్తున్నాయి.

సాగు చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రానికి (BJP-led government) అక్టోబర్ 2వ తేదీ వరకూ రైతు నాయకులు గడువు ఇస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్ అన్నారు. అప్పటికి కూడా ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్ నిరసనలకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మూడు గంటల సేపు దేశవ్యాప్తంగా చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమంగా ప్రశాంతంగా ముగిసింది. రైతుల డిమాండ్లు నెరవేరేంత వరకూ ఇళ్లకు తిరిగి వెళ్లేది లేదని రాకేష్ తికాయిత్ స్పష్టంచేశారు.

రైతులకు దారుణమైన అన్యాయం జరుగుతోంది, కేంద్రానికి లేఖ రాసిన 75 మంది మాజీ సివిల్‌ సర్వెంట్ల బృందం, రైతులకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం, సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి సూచన

అక్టోబర్ 2 వరకు ఒత్తిడిలో కేంద్ర ప్ర‌భుత్వంతో ఎటువంటి చ‌ర్చ‌లు చేయ‌బోమ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రైతు సంఘాల‌తో కేంద్ర ప్ర‌భుత్వం 11 సార్లు చ‌ర్చ‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. కానీ ప్ర‌భుత్వం మాత్రం చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేందుకు అంగీక‌రించ‌లేదు. కేవ‌లం 18 నెల‌ల పాటు ఆ చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌కుండా చూస్తామ‌ని హామీ ఇచ్చింది. దీన్ని రైతు సంఘాలు వ్య‌తిరేకిస్తున్నాయి. తమ డిమాండ్లు తీరేవ‌ర‌కు ఇంటికి వెళ్లేదిలేద‌ని తిక‌యిత్ చెప్పారు.

Here's ANI Tweets

దేశవ్యాప్తంగా ఉన్న ‘చక్కా జామ్’ దృష్ట్యా, ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలోని అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ఖాజీపూర్ సరిహద్దు వద్ద వాహనాల కదలికను ఆపడానికి పోలీసులు బహుళ-పొర బారికేడ్లను నిర్మించారు. ప్రజలను కాలినడకన ఉంచడానికి ముళ్ల తీగలను కూడా ఉంచారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఇచ్చిన ‘చక్కా జామ్’ పిలుపుకు మద్దతుగా నిరసన నిర్వహించినందుకు సెంట్రల్ ఢిల్లీలోని షాహీది పార్క్ సమీపంలో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.

దేశ వ్యాప్తంగా రైతుల రాస్తారోకో, మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రోడ్లు దిగ్బంధం, కొత్త చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా మిగతా దేశమంతా రైతుల చక్కా జామ్

శాంతిభద్రతల పరిరక్షణకు హర్యానా పోలీసులు భద్రతా చర్యలను కూడా వేగవంతం చేశారు. కీలకమైన జంక్షన్లు మరియు రోడ్ల వద్ద భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సీనియర్ పోలీసు అధికారులను కోరారు. వెంటనే తగిన సిబ్బందిని మోహరించాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.



సంబంధిత వార్తలు