Telangana: ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు..దిలావర్‌పూర్‌లో రైతుల ఆందోళన,ఆర్డీవో కారు ధ్వసం, రైతుల అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని ఆమెను ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు.

Farmers protest turns violent at Dilawarpur Nirmal District(video grab)

Nirmal, Nov 27:  లగచర్ల లొల్లి మరువకముందే దిలావర్‌పూర్‌లో మొదలైంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని ఆమెను ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు.

దిలావర్‌పూర్‌లో ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసు వాహనాలను రైతులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉదయం నుంచి నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.

ఇథనాల్ పరిశ్రమ తరలించేంతవరకు ఎన్ని అక్రమ అరెస్టులు జరిగినా భయపడేది లేదన్నారు. ఆర్డీవో రత్న కళ్యాణి కారు మీద దాడి చేసి ఎత్తి పడేశారు రైతులు.

128 రోజులుగా చేస్తున్న తమ ఉద్యమానికి మద్దతు తెలిపిన విజయ్ కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడును సస్పెండ్ చేయగా అయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించమని రైతులు భీష్మించుకుని ఉండగా వెళ్లిపోవాలని ప్రయత్నించిన ఆర్డీవో రత్న కళ్యాణిని అడ్డుకున్నారు.  షాకింగ్...వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు యత్నం, భయంతో బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్న విద్యార్థిని, బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు 

Here's Video:

ఒకానొక సందర్భంలో ఆమె బీపీతో అస్వస్థతకు గురి కాగా భారీ పోలీసు బందోబస్తు నడుమ జిల్లా ఎస్పీ ఆమెను రక్షించేందుకు యత్నించగా మహిళలు దాడి చేయబోయారు.. అనంతరం ఆమెను ఎస్పీ తన కారులో ఆసుపత్రికి తరలించారు. ఆర్డీవో వెళ్లిపోయిన తరువాత ఆందోళనకారులు ఆమె కారు మీద దాడి చేసి ఎత్తి పక్కన పడేశారు.



సంబంధిత వార్తలు