Secundrabad: టికెట్ లేకుండా ప్రయాణించేవారి పాలిట ఆమె సింహస్వప్నం, ఏకంగా కోటి రూపాయల ఫైన్లు వసూలు చేసిన టికెట్ కలెక్టర్, సౌత్ సెంట్రల్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ పై రైల్వేశాఖ ట్వీట్
దీంతో రైల్వే శాఖ అరోకియా మేరీపై ప్రశంసలు కురిపించింది. డ్యూటీలో నిజాయితీగా వ్యవహరించే మేరీ రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేసిన మొదటి టికెట్ అధికారిగా పేరొందారు.
Secundrabad, March 24: దక్షిణ రైల్వేలో (SCR) మీరు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్నారా? అయితే మీకు చుక్కలే..మీరు ప్రయాణించే రైల్లో చీఫ్ టిక్కెట్ ఇన్ స్పెక్టర్ రోసలిన్ అరోకియా మేరీకి (Rosaline Arokia Mary) చిక్కారో..ఇక అంతే జరిమానా కట్టాల్సిందే. అలా టికెట్ లేకుండా ప్రయాణించేవారికి చుక్కలు చూపిస్తున్నారు CTI (Ticket Checker). టికెట్ లేకుండా ప్రయాణిస్తు ఆమెకు చిక్కారంటే పైసలతో సహా జరిమానా కట్టకుండా వదలరు ఆమె. అలా టికెట్ లేకుండా ప్రయాణించేవారి నుంచి రూ.కోటికిపై వసూలు చేసారు మేరీ. దీంతో రైల్వే శాఖ అరోకియా మేరీపై ప్రశంసలు కురిపించింది. డ్యూటీలో నిజాయితీగా వ్యవహరించే మేరీ రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేసిన మొదటి టికెట్ అధికారిగా పేరొందారు.
మేరీ (Rosaline Arokia Mary) డ్యూటీ చేసే సమయంలో చాలా కచ్చితంగా ఉంటారు. నిబంధనలు ఉల్లంఘించేవారి విషయంలో ఎవ్వరిమాటా వినరు. టికెట్ లేకుండా ఆమెకు పట్టుబడితే ఇక అంతేసంగతులు. బతిమాలినా వదిలేదే లేదంటారు మేరీ. టికెట్ లేని ప్రయాణికులు, నిబంధనలు పాటించని ప్రయాణీకుల నుంచి రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేసి రైల్వే శాఖ ప్రశంసలు అందుకున్నారు.
మేరీ నిజాయితీ డ్యూటీ గురించి రేల్వే శాఖ ట్వీట్ చేస్తూ..‘‘విధుల నిర్వహణ పట్ల ఆమె అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి రోసలిన్ అరోకియా మేరీ.. భారతీయ రైల్వేలో రూ.1.03 కోట్ల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టికెట్ చెకింగ్ ఉద్యోగి’’ అని పేర్కొంది.