కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జైళ్లలోని ఖైదీలు కరోనా బారిన పడకుండా... అప్పట్లో తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను విడుదల చేశారు. అలాంటి ఖైదీలపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. కరోనా సమయంలో విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లో మళ్లీ జైళ్లకు రావాలని ఆదేశించింది. జైలుకు వచ్చిన తర్వాత మళ్లీ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత కోర్టుల్లో కూడా పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది. కరోనా సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన అత్యున్నత కమిటీ సిఫారసుల మేరకు తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేశారు.
Here's PTI News
SC directs all convicts, undertrial prisoners released during COVID-19 pandemic to surrender within 15 days
— Press Trust of India (@PTI_News) March 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)