ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏఆర్‌ ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు, వివరాలివే

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్‌ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు.

Perni Nani House Arrest

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)