యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు రాయగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అంతకు ముందు కలెక్టర్ హనుమంతరావు సోమవారం రాత్రి ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. నారాయణపూర్ మండలంలోని హాస్టల్లో ఆయన నిద్రించారు. రాత్రి 9 గంటలకు హాస్టల్‌కు చేరుకున్న హనుమంతరావు... కిచెన్‌తో పాటు హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడే బస చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు పెడుతున్న భోజనం బాగుందన్నారు. మధ్యాహ్న భోజనం వండుతున్న ఏజెన్సీ సభ్యురాలు కవితను అభినందించారు.
ఎస్సీ బాలుర హాస్టల్ లో బస చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్
ఎస్సీ బాలుర హాస్టల్ లో బస చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం లోని ఎస్సీ బాలుర హాస్టల్ లో జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు బస
హాస్టల్ లోని వంట గది, వంట సామగ్రిని పరిశీలించిన కలెక్టర్
విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్… pic.twitter.com/ZiO9ZM7mEk
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)