మహా కుంభమేళాకు(Maha Kumbh 2025) భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండగా పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక కుంభమేళా నేపథ్యంలో యూపీ ప్రభుత్వం(UP Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

ఖైదీలకూ కుంభమేళా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించింది(Kumbh Mela Holy Dip For Pisoners). యూపీలోని 75 జైళ్లలో(Uttar Pradesh Jails) ఉన్న 90,000 మంది ఖైదీలకు పుణ్యస్నానం చేసే అవకాశాన్ని కల్పించింది. ప్రయాగ్ రాజ్(Prayagraj) లోని త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాలను ట్యాంకర్ల ద్వారా రాష్ట్రంలోని జైళ్లకు తరలించి, అక్కడి నీటి ట్యాంకుల్లో కలిపారు అధికారులు.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే

పుణ్యస్నానం అనంతరం ఖైదీలు పూజలు, ఇతర క్రతువులు నిర్వహించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ అధికారులు వెల్లడించారు.

ఇప్పటి వరకు మహా కుంభమేళాలో 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)