Sexual Assault Case: బాలికను గదిలోకి లాక్కెళ్ళి యడియూరప్ప అత్యాచార ఆరోపణలు, సీఐడీ ఎదుట విచారణకు హాజరైన కర్ణాటక మాజీ సీఎం

తన ఇంటిలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి విదితమే.ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు నమోదైంది.

Yediyurappa (photo-ANI)

POCSO Case Against BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప (BS Yediyurappa).. తన ఇంటిలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి విదితమే.ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం తాజాగా ఆయన సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. సోమవారం ఉదయం బెంగళూరులోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న బీజేపీ నేత యడియూరప్పను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

పోక్సో కేసు (POCSO case)లో ఆయనను అరెస్టు చేయవద్దని ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అదుపులోకి తీసుకోవద్దని స్పష్టంచేసింది. అదే సమయంలో.. విచారణకు గైర్హాజరుకాకూడదని యడియూరప్పకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీఐడీ (CID) ఎదుట హాజరయ్యారు.  నా కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.. బాలిక తల్లి ఫిర్యాదుతో కర్ణాటక మాజీ సీఎంపై పోక్సో కేసు నమోదు

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 17 ఏళ్ల బాలికపై యడియూరప్ప (EX CM Yediyurappa) లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆరోపణలు వచ్చాయి. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది.

ఈ కేసుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకంటే ముందే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ రికార్డ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన తర్వాత యడియూరప్ప వాయిస్‌ శాంపిళ్లను కూడా అధికారులు సేకరించారు. కాగా.. ఈ ఆరోపణలను మాజీ సీఎం ఖండించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్,పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

CM Revanth Reddy: హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం, అంతర్జాతీయ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana:మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి, తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif