Rahul Gandhi Indian Citizenship Issue: రాహుల్ గాంధీ భార‌త పౌర‌సత్వాన్ని ర‌ద్దు చేయండి! కోర్టును ఆశ్ర‌యించిన బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి

ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ (BJP) నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టు కు వెళ్లారు. రాహుల్‌గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిందింగా కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) కు ఆదేశాలివ్వాలని ఆయన హైకోర్టును కోరారు.

Rahul Gandhi (Photo-ANI)

New Delhi,, AUG 16: లోక్‌సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత పౌరసత్వం (citizenship) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ (BJP) నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఢిల్లీ హైకోర్టు (Delhi High court) కు వెళ్లారు. రాహుల్‌గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిందింగా కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) కు ఆదేశాలివ్వాలని ఆయన హైకోర్టును కోరారు. లీగల్ వెబ్‌సైట్ బార్ అండ్ బెంచ్ సమాచారం ప్రకారం.. 2003లో యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK) లో రిజిస్టర్ అయిన బ్యాకప్స్ లిమిటెడ్ (Backops Limited) కంపెనీ డైరెక్టర్లు, సెక్రటరీలలో రాహుల్‌గాంధీ ఒకరని తెలియజేస్తూ 2019లో కేంద్రం హోంశాఖకు సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. 2005 అక్టోబర్ 10, 2006 అక్టోబర్ 31 తేదీల్లో ఆ సంస్థ దాఖలు చేసిన రిటర్న్స్‌లో రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరుడిగా డిక్లేర్ చేసినట్టు స్వామి ఆ లేఖలో పేర్కొన్నారు.

Nara Lokesh on Red Book: మా గెలుపులో రెడ్ బుక్ కూడా ఒక భాగం, క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్, చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టనంటూ వార్నింగ్ 

2009 ఫిబ్రవరి 17న ఆ కంపెనీని రద్దు చేసినప్పుడు చేసుకున్న దరఖాస్తులోనూ రాహుల్‌గాంధీ బ్రిటిష్ జాతీయతను మరోసారి ప్రకటించినట్టు స్వామి ఎంహెచ్ఏ దృష్టికి తెచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారత పౌరసత్వ చట్టం 1955ను రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్టు స్వామి ఆరోపించారు. దీనిపై 15 రోజుల్లోగా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతూ 2019 ఏప్రిల్ 29న రాహుల్‌గాంధీకి హోం శాఖ లేఖ రాసింది. హోంశాఖ లేఖ రాసి ఐదేళ్లయినా ఇంతవరకు రాహుల్‌గాంధీ నుంచి ఎలాంటి సమాధానం లేదని స్వామి ఆరోపించారు.