Gold Prices to Rise?: బంగారం కొనేవారికి కేంద్రం భారీ షాక్, దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ఆర్థిక శాఖ, జా నిర్ణయంతో ఎంసీఎక్స్‌ మార్కెట్లో పుంజుకున్న బంగారం ధరలు

అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతున్న ఆందోళనల నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి (Import Tax on Gold Increased by 5%) పెంచింది.

Photo Credit: Pixabay

Mumbai, July 1: పసిడిదిగుమతులకు కళ్లెం వేసేందుకు కూడా ఆర్థికమంత్రిత్వశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతున్న ఆందోళనల నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి (Import Tax on Gold Increased by 5%) పెంచింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరడంతో బంగారం డిమాండ్‌ను తగ్గించాలనే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకుంది.

మే నెలలో మొత్తం 107 టన్నుల బంగారం దిగుమతి కాగా జూన్‌లో కూడా గణనీయంగా దిగుమతులు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బంగారం దిగుమతులు పెరగడం కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో కస్టమ్స్ సుంకాన్ని పెంచివేసింది. గతంలో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం ఉండగా, ఇప్పుడు 12.5 శాతానికి చేరనుంది. దీనికి 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి పన్నుతో కలిపి బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి (Import Duty on Gold) చేరింది. దీనికి జీఎస్‌టీ 3 శాతం అదనపు భారం.

నేటి నుంచి ఈ ప్లాస్టిక్‌ వస్తువులు వాడారో జైలుకే, అమల్లోకి వచ్చిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం, నిషేధిత జాబితాలోని ప్లాస్టిక్‌ వస్తువులు ఇవే..

తాజా నిర్ణయంతో ఎంసీఎక్స్‌ మార్కెట్లో బంగారం ధరలు (Gold Prices to Rise) పుంజుకున్నాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద పసిడి వినియోగ దారుగా ఉన్న ఇండియా బంగారం డిమాండ్‌లో చాలా వరకు దిగుమతుల ద్వారానే. ఇది రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. ఫలితంగా దేశీయ కరెన్సీ రోజుకో రికార్డు కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఇంధన దిగుమతులు,ఎగుమతులను నియంత్రించే చర్యల పరంపరలో, ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాలను విధించింది. పెట్రోలుపై లీటరుకు రూ.6 డీజిల్‌పై లీటరుకు రూ.13 పన్ను విధించింది. ముడి చమురుపై టన్నుకు రూ.23,250 (ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం ) లేదా విండ్‌ఫాల్ పన్ను విధించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటరుకు రూ. 6 ప్రత్యేక అదనపుఎక్సైజ్ సుంకం విధించింది.