Gold Silver Price Today: బంగారం కొనేవారు ఆలోచించుకోండి, మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు, మార్కెట్లో తాజా ధరల వివరాలు ఇవే
ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. క్రితం సెషన్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Gold Silver Price) నేడు ప్రారంభంలో స్వల్పంగా పెరిగాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.24 లాభపడి రూ.51,395 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48 క్షీణించి రూ.66,669 వద్ద ట్రేడ్ అయింది.
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. క్రితం సెషన్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Gold Silver Price) నేడు ప్రారంభంలో స్వల్పంగా పెరిగాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.24 లాభపడి రూ.51,395 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48 క్షీణించి రూ.66,669 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం తగ్గింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.138 లాభపడి రూ.66,060 వద్ద, జూలై సిల్వర్ (Silver ) ఫ్యూచర్స్ రూ.93 లాభపడి రూ.66,851 వద్ద ట్రేడ్ అయింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5000 వరకు తక్కువగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 6 డాలర్లు క్షీణించి 1921 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.142 డాలర్లు క్షీణించి 24.392 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1927 డాలర్ల వద్ద, సిల్వర్ 24.534 డాలర్ల వద్ద ముగిసింది. ఇటీవల రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టానికి (2075 డాలర్లు) సమీపానికి (2060 డాలర్లు) చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గి ఇప్పుడు 155 డాలర్ల వరకు తక్కువగా ఉంది. బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో రూ.51,500 దిగువకు పడిపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వారం రూ.50,000 స్థాయికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు.
కాగా ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయనేది తెలిసిందే. అదే సమయంలో రెండు దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం, వెండితో సహా అన్ని ఇతర అంశాలపై పెను ప్రభావం చూపిస్తుంటుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,030 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,400గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,140 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,800 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,800 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, ముంబైలో రూ.66,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కోల్‌కతాలో రూ.66,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, కేరళలో రూ.71,400గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,400 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.