Google Station: పోర్న్ దెబ్బ, యూజర్లకి గూగుల్ షాక్, రైల్వే స్టేషన్లలో ఇకపై ఉచిత వైఫై దొరకదు, దేశ వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్
రైల్వేస్టేషన్లలో (Railway Stations) ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది పాట్నాలోని రైల్వే స్టేషన్లలో ఎక్కువమంది గూగుల్ ఉచిత వైఫై సర్వీసును పోర్న్ వీడియోలు (Free porn) చూడటానికి మాత్రమే వినియోగిస్తున్నారని RailTel రిపోర్ట్ చేసింది. యూట్యూబ్, వికీపిడియాలను ఫాలో చేస్తూ వాటినే ఆ వీడియోలనే ఎక్కువగా చూస్తున్నారని తెలిపింది. సర్వీసులకు బదులు దాన్ని వాడటంతో గూగుల్ ఈ దిశగా నిర్ణయం తీసుకోవడంలో ఓ భాగమని చెప్పవచ్చు.
New Delhi, Febuary 18: రైల్వే ప్రయాణికులకు గూగుల్ (Google) చేదు వార్తను అందించింది. రైల్వేస్టేషన్‌లలో (Railway Stations) ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో అందిసున్న ఉచిత వైఫైను (Free public WiFi service) ఇకపై ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది.
గూగుల్ సహకారం లేకుండా 5600 స్టేషన్లలో ఉచిత వైఫై
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు (Intertnet In India) ఇప్పుడు చాలా చవకగా మారిపోయాయని, అందుకే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లో ఉచిత వైఫై సేవలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం పోర్న్ దెబ్బేనని తెలుస్తోంది.
పోర్న్ సైట్ల వల్లే రేప్‌లు పెరిగిపోతున్నాయి
గతేడాది పాట్నాలోని రైల్వే స్టేషన్లలో ఎక్కువమంది గూగుల్ ఉచిత వైఫై సర్వీసును పోర్న్ వీడియోలు (Free porn) చూడటానికి మాత్రమే వినియోగిస్తున్నారని RailTel రిపోర్ట్ చేసింది. యూట్యూబ్, వికీపిడియాలను ఫాలో చేస్తూ వాటినే ఆ వీడియోలనే ఎక్కువగా చూస్తున్నారని తెలిపింది. సర్వీసులకు బదులు దాన్ని వాడటంతో గూగుల్ ఈ దిశగా నిర్ణయం తీసుకోవడంలో ఓ భాగమని చెప్పవచ్చు.
ప్రియురాలి వీడియోలను పోర్న్ వెబ్‌సైట్లో చూసి ప్రియుడు షాక్
ఈ విషయంపై గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా స్పందిస్తూ.. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవకగా మారిపోయాయి. అందువల్లనే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను ఎత్తివేయనున్నాం. ఐదేళ్ల క్రితం గూగుల్ స్టేషన్లు (Google Station) ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటా వాడకం సులభతరంగా, చవకగా మారింది. మొబైల్ డేటా ప్లాన్లు చాలా తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
కాలేజీ యువత శృంగార సంబంధ వీడియోలకు బానిస
2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ వేగవంతమైన, ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ఆరంభించింది. 2020 నాటికి 400కు పైగా రైల్వే స్టేషన్లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్టు సీజర్ చెప్పారు. ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‌లో మొబైల్ డేటా లభ్యమవుతోంది.
ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసు ఎత్తివేత నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.