New Delhi, Febuary 18: దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై (RailTel) సదుపాయాన్ని తీసివేస్తున్నట్లుగా గూగుల్ (Google) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై రైల్‌టెల్ (RailTel) స్పందించింది. గూగుల్ సహకారం లేకుండానే దేశంలోని 5600 రైల్వేస్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కొనసాగిస్తామని రైల్‌టెల్ అధికారులు వెల్లడించారు.
రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్
దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో (Railway stations) అందిసున్న ఉచిత వైఫైను గూగుల్ ఎత్తివేస్తున్నట్లు సోమవారం ప్రకటించిన నేపథ్యంలో రైల్‌టెల్ మంగళవారం కీలక ప్రకటన చేసింది.
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ 2015 నుంచి భారతదేశంలోని 400 కి పైగా రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలను అందిస్తోంది. రైల్ టెల్, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏ1, ఎ, సి కేటగిరీలకు చెందిన 415 రైల్వేస్టేషన్లలో మాత్రమే రైల్‌టెల్ టెక్నాలజీ భాగస్వామిగా ఉంది.
Here's RailTel Tweet
— RailTel (@RailTel) February 17, 2020
అయితే ఇప్పుడు బీ, సీ, డీ రైల్వేస్టేషన్లలో కూడా ఉచితంగా వైఫై సౌకర్యం అందిస్తున్నామని రైల్ టెల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గూగుల్ సహకరించకున్నా వైఫై ఉచిత సదుపాయాన్ని రైల్వేస్టేషన్లలో కొనసాగిస్తామని రైల్ టెల్ అధికారులు వివరించారు.
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు (Intertnet In India) ఇప్పుడు చాలా చవకగా మారిపోయాయని, అందుకే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లో ఉచిత వైఫై సేవలను ఎత్తివేస్తున్నట్లు గూగుల్ అధికారులు వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం పోర్న్ దెబ్బేనని తెలుస్తోంది.