Jio 4G Signals In Tihar Jail: తీహార్ జైల్లో జియో దందా, జైలు లోపల జియో 4జీ సిగ్నల్స్ కంట్రోలింగ్ సాధ్యం కావడం లేదు, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన అధికారులు, కేసు విచారణ 28కి వాయిదా
Unable to block Jio 4G signals in Tihar jail, authorities tell HC (photo-PTI)

New Delhi, Febuary 05: టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. తీహార్ జైలులోని అధికారులకు ఝలక్ ఇచ్చినంత పనిచేసింది. తమ వద్ద ఉన్న సాంకేతికతో తీహార్‌ జైలు లోపల జియో 4జీ సిగ్నల్స్‌ను (Jio 4G signals) నిరోధించలేకపోతున్నామని అధికారులు ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) తెలిపారు. అసలు స్టోరీలోకి వెళ్తే..

ఈ మధ్య తీహార్‌ జైల్లో (Tihar jail) అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషి 2018లో ఢిల్లీ హైకోర్టుకు లేఖ రాసిన విషయం విదితమే. జైలు అధికారులు డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, ఖైదీలకు డ్రగ్స్‌ సరఫరా చేయడమే కాకుండా మొబైల్‌ ఫోన్స్‌ (Mobile Phones), ఇతర నిషేధిత వస్తువులు అందజేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. జైల్లో ఖైదీలను జంతువుల మాదిరిగా చూస్తున్నారని ఆ వ్యక్తి లేఖలో ఆరోపించారు.

దీన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు అందులో నిజానిజాలు తేల్చాల్సిందిగా ఓ జడ్జిని నియమించింది. జైల్లో పరిస్థితుల మీద విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది. ఈ విషయంపై విచారణ జరిపిన జడ్జి 2019 ఏప్రిల్‌లో తన రిపోర్ట్‌ను ఢిల్లీ హైకోర్టుకు అందజేశారు. వ్యక్తి ఆరోపించినట్లుగానే జైలు లోపల నిషేధిత వస్తువులు ఉన్నాయని, జైలు అధికారులు డబ్బులు తీసుకుని ఖైదీలకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

రూ.2020తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది‌ పాటు అన్ లిమిటెడ్

ఈ నేపథ్యంలో ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఏం చర్యలు తీసుకున్నారంటూ ఢిలీ​ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న రాహుల్‌ మెహ్రాను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సంధర్భంగా రాహుల్ మెహ్రా తన వాదనలు వినిపించారు. జైల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్‌ చేశామని.. అలాగే శాఖ పరమైన విచారణకు కూడా ఆదేశించామని రాహుల్‌ కోర్టుకు తెలిపారు.

జియో యూజర్లకు ముకేష్ అంబానీ ఝలక్

అలాగే జైలు లోపల 5 వేల సీసీటీవీ కెమెరాలు, 50 బాడీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. జైలులోకి ప్రవేశించేవారిని పూర్తి స్థాయిలో పరీక్షించడానికి బాడీ స్కానర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని కోర్టు దృష్టికి తీసుకోచ్చారు. అయితే ఈ చర్యలపై స్పందించిన న్యాయస్థానం.. కేవలం ఖైదీలను పర్యవేక్షించడానికే మాత్రమే కాకుండా అధికారుల రూమ్‌ల్లో కూడా ఈ రకమైన చర్యలు చేపట్టాలని సూచించింది.

జియో డిజిటల్ పేమెంట్ యాప్ వచ్చేసింది

దీనిపై రాహుల్‌ స్పందిస్తూ కోర్టు సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. అలాగే ఈసీఐఎల్‌ అందజేసిన జామర్ల ద్వారా మొబైల్‌ సిగ్నల్స్‌ను (Mobile Signals) నిరోధించడానికి ప్రయత్నించినట్టు రాహుల్‌ కోర్టుకు తెలిపారు. అయితే వాటి ద్వారా ముఖ్యంగా జియో (Reliance Jio) 4జీ సిగ్నల్‌ను బ్లాక్‌ చేయలేకపోయామని అన్నారు. జైలు లోపల మొబైల్ ఫోన్‌ల అక్రమ వినియోగాన్ని అరికట్టడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు.

టారిఫ్ ధరలను పెంచే యోచనలో కంపెనీలు

జైలు పరిసరాల్లో మొబైల్‌ సిగ్నల్స్‌ను నిరోధించేలా ప్రత్యేక ప్రోటోటైప్‌ జామర్‌ను తయారు చేయాలని సీడాట్‌ను(Centre for Development of Telematics (C-DOT) కోరినట్టు కోర్టుకు వివరించారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది.