Mumbai, December 24: టెలికాం రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio)తాజాగా మరో బంపరాఫర్ ప్రకటించింది. కస్టమర్ల కోసం జియో 2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను(2020 Happy New Year Offer) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్(Smartphone) వినియోగదారులకు అపరిమిత సేవలను రూ.2020కే అందిస్తోంది.
ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటాతో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. దీంతో పాటు రూ. 2020తో యూజర్లు రీఛార్జ్ చేసుకుంటే వారికి ఏడాది పాటు అన్ లిమిటెడ్ సేవలు లభిస్తాయి. డిసెంబరు 24 నుంచి ఈ ప్లాన్ కస‍్టమర్లకు అందుబాటులో ఉంటుంది.
అదేవిధంగా నూతనంగా జియో ఫోన్‌ను కొనుగోలు చేసే వారు రూ.2020 చెల్లిస్తే జియో ఫోన్‌తోపాటు 12 నెలల వాలిడిటీ ఉన్న ప్లాన్ ఆ ఫోన్‌లో వస్తుంది. అందులో రోజుకు 0.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే ఈ రెండు ప్లాన్లలోనూ జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్ల గురించి మై జియో యాప్ లేదా జియో వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ ఆఫర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో పాటు జియో ఫోన్ వినియోగదారులూ (Jio Phone Users) పొందొచ్చు. ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రోజుకు 1.5 జీబీ డేటా, జియో నెట్‌వర్క్‌పై అపరిమిత కాల్స్, ఇతర నెట్‌వర్క్‌లకు 12,000 నిమిషాలు, ఉచితంగా జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
వీటితో పాటు రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా రూ.98, రూ.149ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకురానుంది. ఈ రూ.98 ప్లాన్‌తో 28 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటాతో పాటు 300ఎస్ఎమ్ఎస్ లను కూడా అందిస్తుంది. జియో టు జియో ఫ్రీ కాల్స్ మాత్రమే ఇస్తుంది. ఇందులో ఐయూసీ నిమిషాలను ఇవ్వడం లేదు.
రూ.149ప్రీ పెయిడ్ యూజర్లకు రోజుకు 1జీబీ డేటా ఇవ్వడంతో పాటు జియో టు నాన్ జియో యూజర్లకు 300నిమిషాలు, రోజుకు 100ఎస్ఎమ్ఎస్‌లు ఇస్తుంది. జియో టు జియో ఫ్రీ. దీని వ్యాలిడిటీ కేవలం 24రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆల్ ఇన్ వన్ ప్యాక్ రూ.555ప్యాక్. ఇది 84రోజుల పాటు సేవలు అందిస్తుండగా రోజుకు 2జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక ఇప్పుడు తీసుకురానున్న రూ.2020తో రీచార్జ్ చేసుకుంటే 12నెలల పాటు రోజుకు 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. అంటే డేటా వినియోగం తక్కువ చేసే వాళ్లకు మాత్రమే.