 
                                                                 రిలయన్స్ జియో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త వ్యాల్యూ యాడెడ్ రీఛార్జ్ ప్లాన్లను తాజాగా ప్రకటించింది.ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే ఆఫర్లను జియో ఆవిష్కరించింది. సాధారణంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ.180 నుంచి రూ.200 మధ్య ఉంటాయి. అయితే నెలకు రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్‌ను జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
ఈ ప్లాన్‌లో కస్టమర్లు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3600 ఉచిత మెసేజులు, జియో అనుబంధ యాప్‌ల యాక్సెస్‌తో పాటు అదనంగా 24 జీబీల హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. నెలవారీ ప్లాన్‌ను పొందాలనుకుంటే రూ. 189 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు 2జీబీ డేటా కూడా పొందవచ్చు. వినియోగదారులు జియోటీవీ, జీయో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో అనుబంధ యాప్‌ల సర్వీసులు పొందవచ్చు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
