SC on Governor Rules: అసెంబ్లీలు రూపొందించిన చట్టాలను గవర్నర్లు అడ్డుకోకూడదు, అలా చేస్తే అధికారం దుర్వినియోగం చేయడమే, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ అడ్డుకోవడం లాంటి చర్యలు ప్రజలు ఎన్నుకొన్న శాసనసభ్యుల అధికారాన్ని తగ్గించే విధంగా ఉన్నాయని పేర్కొంది.

Supreme Court of India (File Photo)

New Delhi, Nov 24: రాష్ట్ర శాసనసభలు రూపొందించిన చట్టాలను అడ్డుకునేందుకు గవర్నర్‌లు తమ అధికారాన్ని (SC on Governor Rules) దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అడ్డుకోవడం లాంటి చర్యలు ప్రజలు ఎన్నుకొన్న శాసనసభ్యుల అధికారాన్ని తగ్గించే విధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ 19, 20 తేదీల్లో పంజాబ్‌ శాసనసభ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని పంజాబ్‌ గవర్నర్‌ భన్వర్‌లాల్‌ పురోహిత్‌ను ఆదేశించింది. ఈ మేరకు పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నంబరు 10వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రతి గురువారం రాత్రి వెబ్‌సైట్‌లో ఉంచారు.

పార్లమెంట్‌ ప్రకారం అధికారం అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకే ఉంటుంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతిగా మాత్రమే వ్యవహరిస్తారు. రాష్ట్రం లేదా దేశానికి సంబంధించి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది.ఈ విధానమే ప్రజాస్వామ్య సుస్థిరతకు పునాది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రాజ్యాంగపరమైన నిర్ణయాలకు గవర్నర్‌ మార్గదర్శిలా మాత్రమే వ్యవహరించాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 27 పేజీల తీర్పులో పేర్కొంది.

ముంబయి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు మెయిల్, ఒక మిలియన్ డాలర్లు చెల్లించాలని అగంతకులు డిమాండ్

రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానించిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌లు ఆమోదించడంలేదని పంజాబ్‌ సహా తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం నవంబరు 10న పంజాబ్ గవర్నర్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత వారం కేరళ, తమిళనాడు పిటిషన్లపై విచారణ సందర్భంగా ‘మూడేళ్లుగా ఏం చేస్తున్నారని?’ తమిళనాడు గవర్నర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మరోవైపు పెండింగ్ బిల్లులపై జాప్యానికి గల కారణాలు తెలియజేయాలని కేరళ గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.



సంబంధిత వార్తలు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

YS Jagan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన జగన్, ఈ ఘటనకు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్న వైసీపీ అధినేత

Harishrao: జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణం..సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్‌ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్