PM Garib Kalyan Anna Yojana: మరో 4 నెలలు ఉచిత రేషన్, కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం పొడిగింపు
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరోసారి పొడిగించింది. మార్చి 2022 వరకు పేదలకు ఉచిత రేషన్ ఇచ్చేందుకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన ఈ పథకం నవంబర్‌తో ముగుస్తుంది, కానీ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు పథకాన్ని పొడిగించినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
New Delhi November 24: రేషన్ కార్డు వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరోసారి పొడిగించింది. మార్చి 2022 వరకు పేదలకు ఉచిత రేషన్ ఇచ్చేందుకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన ఈ పథకం నవంబర్‌తో ముగుస్తుంది, కానీ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు పథకాన్ని పొడిగించినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ పంపిణీ జరుగుతుంది.
గతేడాది కేంద్రం ప్రకటించిన ఈ పథకం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు కొనసాగింది. అప్పటికీ కరోనాతో సంక్షోభ వెంటాడుతుండటంతో మరో ఐదు నెలల పాటు వరకు పొడిగించింది. ఆ తర్వాత కొవిడ్ సెకండ్ వేవ్ రావడంతో మరోసారి రెండు నెలల పాటు పొడిగించింది. ఆ తర్వాత మరో ఐదు నెలల పాటు వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా మరోసారి 2022 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.