Gujarat Shocker: రాత్రికి నా కోరిక తీర్చమన్న కామాంధుడు, మహిళ నో చెప్పడంతో యాసిడ్ దాడి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో నిందితుడు

తన కోర్కెను తిరస్కరించినందుకు 39 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడి చేశాడు కామాంధుడు. బాధితురాలిని గ‌ట్లోదియా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో కేర్‌టేక‌ర్‌గా పనిచేస్తున్న మ‌హిళ (39)గా గుర్తించారు.

Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Ahmedabad, Mar 8: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తన కోర్కెను తిరస్కరించినందుకు 39 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడి చేశాడు కామాంధుడు. బాధితురాలిని గ‌ట్లోదియా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో కేర్‌టేక‌ర్‌గా పనిచేస్తున్న మ‌హిళ (39)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర‌న్‌పురా ప్రాంతానికి చెందిన నిందితుడు శివ‌నాయ‌క్ ఆటోలో రోజూ ఆమె ప‌ని చేసే ప్రాంతానికి వెళుతుండేది. ఈ క్ర‌మంలో మ‌హిళ మొబైల్ ఫోన్ నెంబ‌ర్‌ను నిందితుడు తెలుసుకున్నాడు. త‌న‌తో స‌న్నిహితంగా మెల‌గాల‌ని నాయ‌క్ ఒత్తిడి చేయ‌గా బాధితురాలు నిరాక‌రించింది. ఇది మ‌న‌సులో పెట్టుకున్న నాయ‌క్ ఆదివారం రాత్రి ఆమె ప‌ని ముగించుకుని ఇంటికి వెళుతుండ‌గా అడ్డ‌గించిన నిందితుడు ఆమెను చంపుతాన‌ని బెదిరించ‌డంతో పాటు యాసిడ్ (39-year-old woman attacked with acid by stalker) విసిరి పారిపోయాడు. 15 శాతం కాలిన గాయాలైన బాధితురాల‌ని ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప‌రారీలో ఉన్న నిందితుడిని (stalker in Ahmedabad) ప‌ట్టుకునేందుకు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశామ‌ని పోలీసులు తెలిపారు.

పెళ్లి కట్నం ఇస్తేనే కాపురం చేస్తానన్న వరుడు, లేకుంటే పెళ్లిని రద్దు చేస్తానని బెదిరింపులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

నిందితుడిపై యాసిడ్ దాడికి 326A, వెంబడించినందుకు 354D మరియు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) యొక్క క్రిమినల్ బెదిరింపు కోసం 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఘట్లోడియా పోలీస్ స్టేషన్‌ అధికారులు తెలిపారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif