Gujarat Shocker: పొలంలో చిన్నారి చెయ్యి, బ్రతికుండగానే పసిగుడ్డును పాతిపెట్టిన దుర్మార్గులు, గుర్తించి కాపాడిన రైతు, గుజరాత్‌లో అమానుష ఘటన

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన గుజరాత్‌లో జరిగింది. కళ్లుకూడా తెరవని పసిగుడ్డును బతికుండగానే పాతిపెట్టారు కొందరు దుర్మార్గులు. పొలానికి వెళ్లిన రైతు గుర్తించడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన గుజరాత్, సంబర్కాంత (Sabarkantha) జిల్లా, గంభోయ్ గ్రామంలో జరిగింది.

Sabarkantha, AUG 05: మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన గుజరాత్‌లో జరిగింది. కళ్లుకూడా తెరవని పసిగుడ్డును బతికుండగానే పాతిపెట్టారు కొందరు దుర్మార్గులు. పొలానికి వెళ్లిన రైతు గుర్తించడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన గుజరాత్, సంబర్కాంత (Sabarkantha) జిల్లా, గంభోయ్ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన రైతు గురువారం ఉదయం తన పొలానికి (Farm) వెళ్లాడు. ఈ క్రమంలో ఒక చోట తన పొలంలో ఎవరో తవ్వినట్లు అనిపించింది. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే.. ఒక చిన్నారి చేయి పైకి తేలి కనిపించింది. వెంటనే షాక్ తిన్న రైతు.. పక్కనే పవర్ స్టేషన్‌లో పని చేస్తున్న వాళ్లను పిలిచాడు. వారి సహాయంతో అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా, ఒక శిశువు (Baby) కనిపించింది.

Uttar Pradesh: సినిమా స్టోరీని మించిన కథ ఇది, 12 ఏళ్ళ క్రితం గ్యాంగ్ రేప్, గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చిన బాధితురాలు, 28 ఏళ్ళ తరువాత తండ్రిని వెతుక్కుంటూ వచ్చిన కుమారుడు 

అయితే, ఆ చిన్నారి ప్రాణాలతోనే ఉంది. వెంటనే విషయాన్ని ఆ రైతు అధికారులకు తెలిపాడు. పొలానికి చేరుకున్న అధికారులు అంబులెన్స్‌లో చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Uttar Pradesh Shocker: విషాదం అంటే ఇదే.. పాముకాటుతో అన్న మృతి, అంత్యక్రియల కోసం వచ్చిన తమ్ముడిని కూడా కాటేసిన పాము, యూపీలో కేసు వెలుగులోకి 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారి తల్లిదండ్రుల్ని కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, చిన్నారి విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement