Lucknow, August 4: యూపీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల క్రితం ఓ యువతి అత్యారానికి గురి కాగా ఆ యువతి (Rape survivor in Shahjahanpur) అనంతరం ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ బాలుడిని యువతి తల్లిదండ్రులు వేరే కుటుంబానికి పెంచుకోవడానికి ఇచ్చారు. అనంతరం ఈ బాధిత యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే ఆ బాలుడు పెరిగి పెద్దవాడై తన తల్లి దగ్గరకు వచ్చి తండ్రి ఎవరని అడగగా.. ఆమె జరిగిన ఘటన గురించి తెలిపింది.
దీంతో ఆ బాలుడు తన తండ్రి కోసం కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్టు అత్యాచారం చేసిన నిందితులకు డీఎన్ఎ టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ డీఎన్ఏ టెస్టుల్లో (her son finds father after DNA test) గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఒక వ్యక్తి అతడి తండ్రిగా తేలింది.28 ఏళ్ల తరువాత (justice after 28 years) ఆ బాధితురాలికి న్యాయం దక్కింది. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ సంఘటన యూపీలో జరిగింది.
ఘటన లోతుల్లోకి వెళితే.. 1994లో షాజహాన్‌పూర్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలిక తన అక్కాబావ ఇంట్లో నివసించింది.అయితే ఒక రోజున ఆ ఇంట్లోకి చొరబడిన స్థానికులైన కొందరు యువకులు ఒంటరిగా ఉన్న ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. 13 ఏళ్ల వయసులో ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే ఆమె తల్లిదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చారు. ఆ కుటుంబం రాంపూర్‌కు వలసపోయింది.
కాగా, ఆ బాలిక తల్లిదండ్రులు ఆమెకు ఒక వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే పదేళ్ల కాపురం తర్వాత భార్యపై గతంలో గ్యాంగ్ రేప్ జరిగినట్లు భర్తకు తెలిసింది. దీంతో భార్యకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు పెద్దవాడైన ఆ మహిళ కుమారుడు ఆమెను కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరని అడిగాడు. జరిగిన సంగతి ఆ తల్లి చెప్పింది. దీంతో తన తండ్రి ఎవరన్నది అతడు తెలుసుకోవాలనుకున్నాడు. దీనిపై కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరుపడంతో గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు గుర్తించారు. వారికి డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకరైన గుడ్డు 27 ఏళ్ల వ్యక్తి తండ్రిగా తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.