Lucknow, August, August 4: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య చెంపపై భర్త కొట్టాడనే (slapping her in Bareilly) ఆగ్రహంతో ఓ భార్య తన భర్తపై యాసిడ్ తో దాడి చేసింది. అంతే కాకుండా ఈ యాసిడ్ లో కారంపొడి కలిపి (Woman throws acid mixed with chilli powder) మరీ అతనిపై పోసింది. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ యాసీన్ మద్యానికి బానిసయ్యాడు.ప్రతి రోజు మద్యం సేవించి వచ్చి భార్య ఫర్హాతోపాటు నాలుగేళ్ల కుమార్తెను కొట్టేవాడు.
రోజూ లాగే రెండు రోజుల కిందట తాగి ఇంటికి వచ్చిన యాసీన్, తన భార్య చెంపపై కొట్టాడు. అనంతరం నిద్రపోయాడు. అయితే భార్య ఫర్హా దీనిపై రగిలిపోయింది. యాసిడ్‌లో కారంపొడి కలిపి నిద్రపోతున్న భర్తపై పోసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. శరీరంపై పలు చోట్ల 40 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. కాగా, యాసీన్ బంధువులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యాసిడ్‌తో దాడి చేసిన భార్యపై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. బాధితుడు కోలుకున్న తర్వాత వివరాలు అడుగుతామని పోలీసులు తెలిపారు. మరోవైపు భర్తపై యాసిడ్ దాడి అనంతరం భార్య ఫర్హా, తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.