Gujarat Shocker: నేను మగాడిని కాదని నా భార్యకు పెళ్లికి ముందే తెలుసు, అయినా అప్పుడు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆస్తి కోసం ఇప్పుడు నాటకాలు ఆడుతోంది, గుజరాత్ భార్య ఆరోపణలను ఖండించిన ఆమె భర్త

ఈ కేసులో షాకింగ్ విషయాలను ఆమె భర్త మీడియాకు వెల్లడించారు.

Dr Viraj Vardhan. (Photo Credits: ANI)

Vadodara, Sep 19: గుజరాత్ వడోదరలో నా భర్త మగాడు కాదని పోలీసులకు ఓ భార్య ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో షాకింగ్ విషయాలను ఆమె భర్త మీడియాకు వెల్లడించారు. నేను మగాడిని కాదనే విషయం నా భార్యకు ముందే తెలుసని, అంతేకాదు తాను లింగమార్పిడి సర్జరీలకు ( Gender Reassignment Surgery) వెళ్తున్నాననే విషయం కూడా ఆమెకు తెలుసని డాక్టర్‌ విరాజ్‌వర్థన్‌ తెలిపారు. భార్య అతనిపై చేసిన ఆరోపణలను (Husband Denies) ఖండించాడు.

ఆమె, ఆమె బిడ్డ నాకు ఎంతో దగ్గరయ్యారని, అంతేకాదు ఆమె కూతురిని తాను దత్తత కూడా తీసుకున్నానని ఆయన మీడియాకు వెల్లడించారు.తన లోపాన్ని సాకుగా చూపించి ఇల్లు తనపేరిట రాయాలంటూ ఆమె ఆ టైంలో డిమాండ్‌ చేసింది. ఇవ్వడం కుదరనే సరికి ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుంది. కానీ, కొన్నాళ్లకు కూతురు వంకతో మళ్లీ వచ్చింది. పెద్దల సమక్షంలో ఎలాగోలా వివాహం జరిగింది. అంతా తెలిసి ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత (Wife Finds After 8 Years) ఆమె నేను విషయం దాచానంటూ మీడియా ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది అని విరాజ్‌ అలియాస్‌ విజేత పేర్కొన్నారు.

శృంగారం కోసం రూంలోకి పిలిచిన భార్య, ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరిగిన భర్త, కట్ చేస్తే మగాడిని కాదంటూ సర్జరీకి వెళుతున్నానంటూ షాక్, భార్య ఏం చేసిందంటే..

పెళ్లైనప్పటి నుంచి తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామని, అసహజ లైంగిక చర్యలో పాల్గొన్న ఆరోపణలను సైతం ఆయన ఖండించారు. అయితే.. గత ఏడాది కాలంగా మాత్రం వేర్వేరు గదుల్లో పడుకుంటున్నామని, ఆమె తన గదిలో సీసీకెమెరా ఇన్‌స్టాల్‌ చేసి రహస్యంగా ఫొటోలు తీయడం ప్రారంభించిందని, ఈ ఏప్రిల్‌ నెలలో తన సోదరుడితో వచ్చి ఆ ఫొటోలు చూపించి ఆస్తి తన పేరిట రాయాలని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించిందని చెప్పారాయన. తాను పుట్టుకతో మహిళనే విషయం తెలిపిన విరాజ్‌.. పెళ్లికి ముందే ట్రాన్స్‌జెండర్‌ అయ్యానని, ప్రస్తుతం పురుషుడిగా మారేందుకు సర్జరీలు చేయించుకుంటున్నాననే విషయాన్ని అంగీకరించారు.

గుజరాత్‌ వడోదర సయాంజిగంజ్‌కు చెందిన సదరు మహిళకు గతంలో పెళ్లై.. ఓ కూతురు ఉంది. అయితే భర్త చనిపోయాక 2014లో మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా ఢిల్లీకి చెందిన డాక్టర్‌ విరాజ్‌తో వివాహం జరిగింది. అయితే తన భర్త మగవాడు కాదని.. ఆపరేషన్‌ ద్వారా మారిన స్త్రీ అంటూ గోత్రీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది.



సంబంధిత వార్తలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య