Gyanvapi Mosque (Photo Credits: PTI)

జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లోని దక్షిణ సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతించాలన్న వారణాసి కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ముస్లిం పక్షం చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు సోమవారం, ఫిబ్రవరి 26న తిరస్కరించింది. "వ్యాస్ తెహ్ఖానా"లో పూజను కొనసాగించడానికి హిందువులకు కోర్టు అనుమతించింది. జ్ఞాన్వాపి కాంప్లెక్స్ యొక్క మతపరమైన స్వభావానికి సంబంధించి వివాదాస్పద వాదనలకు సంబంధించి కొనసాగుతున్న సివిల్ కోర్టు కేసు మధ్య న్యాయస్థానం యొక్క ఆదేశం ఆమోదించబడింది.

వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని ఇటీవల వారణాసి సెషన్స్ జడ్జి అనుమతిచ్చారు. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో ( Allahabad High Court) సవాల్ చేసింది. పిటిషన్‌పై ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ ఈ రోజు పూజలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు.జ్ఞానవాపి వివాదం నేపథ్యంలో 1993 నుంచి హిందువుల పూజలు నిలిచిపోయాయి.  శివలింగ మినహా జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారణాసి కోర్టు ఆదేశాలు

ఇటీవల వారణాసి కోర్టు తీర్పు ఇవ్వడంతో పూజలు ప్రారంభించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కోర్టు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. పూజ క్రతువుల కోసం ఆర్చకుడిని నియమించాలని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్‌కు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది.

Here's ANI News

జ్ఞానవాపి మసీదు ప్రాంగణం దక్షిణ భాగంలో వ్యాస్ కా టెఖనా ఉంది. ఆ నేలమాలిగ వద్ద మహా శివుడు కొలువై ఉన్నారు. భక్తులు పూజలు చేయడం ప్రారంభించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు



సంబంధిత వార్తలు

Cyclone Remal Update: దూసుకొస్తున్న తుఫానుకు రెమాల్‌గా నామకరణం, ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే, ఆదివారం తీరం దాటే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు తప్పిన సైక్లోన్ ముప్పు

GHMC SFA Suspended: ఆ కామాంధుడిని సస్పెండ్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్, ఘటనపై ఎంక్వైరీ చేయాలని అధికారులకు ఆదేశాలు, పారిశుద్ద్య కార్మికురాలిపై లైంగిక వేధింపులు

Telugu States Road Accidents: తెల్లవారుజామున నెత్తురోడిన తెలుగు రాష్ట్రాల రహదారులు, రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురి పరిస్థితి విషమం

Asaduddin Owaisi on POK: పీవోకేపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు, అది భారత్‌లో అంతర్భాగమే కాని బీజేపీ ఎన్నికల సమయంలోనే..

Bomb Threat To Home Ministry: కేంద్ర హోంశాఖను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్, అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, ఫేక్ అని నిర్థారణ

EVM Destroy in Andhra Pradesh: ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంది, అందుకే రీపోలింగ్ నిర్వహించలేదు, మాచర్ల ఈవీఎంల ధ్వంసం ఘటనపై మీడియాతో ముఖేశ్‌ కుమార్‌ మీనా

EVM Destroy in Andhra Pradesh: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, వైరల్ వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

KKR vs SRH, IPL 2024: నాలుగవ సారి ఫైనల్‌కు చేరిన కోల్‌క‌తా నైట్ రైడర్స్, తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం