Haryana Lockdown Extended: జూన్ 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు నడవనున్న వాణిజ్య సముదాయాలు
కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వాణిజ్య సముదాయాలు సరిబేసి విధానంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు నడుస్తాయని తెలిపారు.
New Delhi, May 30: కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వాణిజ్య సముదాయాలు సరిబేసి విధానంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు నడుస్తాయని తెలిపారు. అయితే విద్యా సంస్థలు మాత్రం జూన్ 15 వరకు తెరిచేదిలేదని వెల్లడించారు.
కాగా, రాత్రి కర్ఫ్యూ 10 గంటల నుంచి మరుసటి రోజు 5 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో మొదటిసారి మే 3న వారం రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. అది మే 10న ముగియడంతో 18వ తేదీవరకు పొడిగించారు. అనంతరం దానిని ఈ నెల 31 వరకు మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాజాగా మళ్లీ పొడిగించింది.
Here's ANI Update
హర్యానాలో ఇప్పటివరకు 7,53,937 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23,094 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 7,22,711 మంది బాధితులు కోలుకున్నారు. మరో 8,132 మంది కరోనా వల్ల మరణించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1868 కేసులు కొత్తగా నమోదయ్యాయి.