Haryana Shocker: బాలుడ్ని వదలని కామాంధులు, ఇంట్లో పనికోసం వెళ్తే యజమాని, అతని ఫ్రెండ్ దారుణంగా అత్యాచారం, ఈ ఘటన గురించి యజమాని మరో స్నేహితుడుకి చెబితే అతను కూడా లైంగిక దాడి
ఇంట్లో పనిచేసే 16 ఏండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు (Two booked for sexually assaulting) పాల్పడ్డారు. 2020 జూన్‌లో ఈ ఘటన జరగ్గా బాధితుడు కుటుంబసభ్యులకు ఈ విషయం వెల్లడించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Gurugram, Mar 2: హర్యానాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పనిచేసే 16 ఏండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు (Two booked for sexually assaulting) పాల్పడ్డారు. 2020 జూన్‌లో ఈ ఘటన జరగ్గా బాధితుడు కుటుంబసభ్యులకు ఈ విషయం వెల్లడించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.బాధితుడిపై (16-year-old boy in Gurugram) యజమానితో పాటు అతడి ఇద్దరు స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. నీచమైన నేరానికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారని గురుగ్రాం పోలీసులు వెల్లడించారు.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని రాజస్ధాన్‌కు పంపామని చెప్పారు. ఈ ఘటన అనంతరం తీవ్ర వేదనకు గురైన బాధితుడు సాయం కోసం యజమాని స్నేహితుడిని ఆశ్రయించగా అతడు కూడా లైంగిక వేధింపులకు దిగాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నామని బాధితుడు పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితుడికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తుండగా నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు
గురుగ్రామ్ పోలీసు అధికార ప్రతినిధి సుభాష్ బోకెన్ మాట్లాడుతూ, “ఎఫ్‌ఐఆర్‌లో ఇద్దరి పేర్లు ఉన్నాయి. నిందితులు పరారీలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరి ఆచూకీ కోసం పోలీసు బృందం రాజస్థాన్ వెళ్లింది. ఈ సంఘటన 2020లో జరిగింది. బాధితుడు తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత, తాను గాయపడ్డానని, సహాయం కోసం తన యజమాని స్నేహితుడిని అడిగానని బాధితుడు చెప్పాడు.
యజమాని స్నేహితుడు కూడా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించాడు. మేము విచారణ ప్రారంభించాము. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాలుడు ఇంకా పంచుకోలేదని తెలిపారు. బాలుడి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశామని, శిశు సంక్షేమ కమిటీ అధికారులు అతనికి కౌన్సెలింగ్ అందించారని పోలీసులు తెలిపారు. కాగా నిందితులిద్దరి నేపథ్యం గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.