Hemant Soren Oath: జార్ఖండ్ 14వ సీఎంగా హేమంత్ సోరేన్, సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం..హాజరుకానున్న ఇండియా కూటమి నేతలు
సాయంత్రం 4 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా రాంచీ లోని మొరబడి గ్రౌండ్ లో హేమంత్ సొరేన్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్.
Delhi, Nov 28: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు జేఎంఎం నేత హేమంత్ సొరేన్. సాయంత్రం 4 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా రాంచీ లోని మొరబడి గ్రౌండ్ లో హేమంత్ సొరేన్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్.
ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఇండియా కూటమి కీలక నేతలు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను నిన్న కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు హేమంత్ సొరేన్ దంపతులు. 49 ఏళ్ల సోరెన్ జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.
సోరెన్ ఒక్కరే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుందని తెలుస్తోంది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవితో పాటు జేఎంఎంకు ఆరు మంత్రి పదవులు దక్కుతాయని భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు నాలుగు, తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కు ఒక బెర్త్‌లు దక్కనున్నాయి.
ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న సీపీఐ-ఎంఎల్ బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనుంది.
కాంగ్రెస్ నేతలతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యే అవకాశం ఉంది. సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు, పోరాటం నా రక్తంలోనే ఉంది...సీఎం పదవి విషయంలో మోదీ నిర్ణయమే ఫైనల్
జార్ఖండ్‌లో ఇండియా కూటమి వరుసగా రెండోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 81 స్థానాలకు గాను జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) 2 సీట్లు గెలుచుకున్నాయి. మా నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని సోరెన్ చెప్పారు. ఈ విజయం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని...ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తామని తెలిపారు.