Hijab Row: హిజాబ్ తీస్తేనే పరీక్షలకు అనుమతి, బీహార్‌లో మళ్లీ మొదలైన హిజాబ్ మంటలు, పోలీసులు రాకతో సద్దుమణిగిన వ్యవహారం,కాలేజీ ప్రిన్సిపాల్ ఏమన్నారంటే..
తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు (Students Sit On Protest) దిగారు. ముజఫర్‌పూర్‌లోని ఓ మహిళా కాలేజీలో ఇంటర్ సెంట్-అప్ ఎగ్జామ్స్ రాసేందుకు విద్యార్థినులను ఉపాధ్యాయుడు హిజాబ్ (Hijab) తీయాలని కోరాడు.
Patna, OCt 17: దేశంలో హిజాబ్ సమస్య ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు (Students Sit On Protest) దిగారు. ముజఫర్‌పూర్‌లోని ఓ మహిళా కాలేజీలో ఇంటర్ సెంట్-అప్ ఎగ్జామ్స్ రాసేందుకు విద్యార్థినులను ఉపాధ్యాయుడు హిజాబ్ (Hijab) తీయాలని కోరాడు. హెడ్ స్కార్వ్ తీస్తేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తానని ( Remove Hijab In Bihar) చెప్పాడు.దానికి నిరాకరించిన విద్యార్థినులు.. తమపట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పోలీసుల జోక్యంతో శాంతించిన విద్యార్థినులు.. ఆందోళన విరమించి పరీక్ష రాసి వెళ్లిపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌పూర్‌లోని మహంత్ దర్షన్ దాస్ మహిళా (MDDM) కాలేజీలో ఆదివారం ఇంటర్మీడియట్ సెంట్ అప్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష రాసేందుకు కొంతమంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారు. ఈ నేపథ్యంలో తరగతి వద్ద రవి భూషణ్ అనే ఉపాధ్యాయుడు.. బ్లూటూత్ వంటి పరికరాలు ఉంటాయనే అనుమానంతో వారిని హిజాబ్ తీయాలని కోరాడు. అయితే దీనికి వారు తిరస్కరించారు. ఎవరైనా మహిళా ఉద్యోగులు ఉంటే.. వారితో తమను తనిఖీ చేయించాలన్నారు.
ఈ సందర్భంగా ఎవరివద్దనైనా బ్లూటూత్ దొరికితే వారిని పరీక్ష రాయడానికి అనుమతించవద్దన్నారు. అయితే హెడ్ స్కార్వ్ తీసేస్తేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తానని ఆ ఉపాధ్యాయుడు చెప్పడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ పట్ల ఉపాధ్యాయుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని.. ఇక్కడ ఉంటున్న మీరు.. అక్కడి పాట పాడుతారని, పాకిస్థాన్ వెళ్లిపోవాలన్నాడని ఆరోపిస్తూ కాలేజీ ఎందుట ఆందోళనకు దిగారు.
కాగా, ఈ వివాదంపై కాలేజీ ప్రిన్సిపాల్ స్పందించారు. ఆందోళనతో కాలేజీలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు, బ్లూ టూత్ వంటి పరికరాలు పెట్టుకునే అవకాశం ఉండటంతోనే హెడ్ స్కార్వ్ తొలగించాలని తమ సిబ్బంది కోరారని చెప్పారు. దానిని వారు మతానికి ముడిపెట్టి విషయాన్ని వివాదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హిజాబ్ సమస్య కాదు. చాలా మంది విద్యార్థులు మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లారు, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. పరీక్ష హాల్ వెలుపల తమ హ్యాండ్‌సెట్‌లను విడిచిపెట్టమని అడిగారు.అమ్మాయికి దానితో సమస్య ఉంటే, ఆమె పరీక్ష కంట్రోలర్‌కి లేదా నాకు తెలియజేయవచ్చు. కానీ ఆమెకు వేరే ఉద్దేశాలు ఉన్నాయి. ఆమె స్థానిక పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి, స్థానికంగా ఉన్న కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు కూడా ఆమెకు తెలిసినట్లు అనిపించింది. వారు వచ్చినప్పుడు, ఆమె గొడవ సృష్టించింది, ”అని ప్రిన్సిపాల్ ఆరోపించారు.
స్థానిక పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూసుకున్నారు. “ఇరువైపులా మేము కౌన్సెలింగ్ చేసాము మరియు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ప్రస్తుతం, ఈ ప్రాంతంలో కేసు నమోదు చేయడం లేదా అదనపు బలగాలను మోహరించడం అవసరం లేదు. కానీ మేము నిఘా ఉంచుతామని SHO చెప్పారు.
కర్నాటకలోని విద్యాసంస్థల్లో వేషధారణపై రాష్ట్ర ప్రభుత్వం హిజాబ్‌పై నిషేధం విధించడంతో భారీ వివాదం చెలరేగింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు విచారణకు వచ్చింది. కర్నాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌లపై నిషేధంపై అక్టోబరు 13న అత్యున్నత న్యాయస్థానం విభజన తీర్పును వెలువరించింది. విశాల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తికి ఈ విషయాన్ని సూచించింది.