Hizbul Commander Killed In Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్ కౌంటర్, హిజ్బుల్ కమాండర్ మృతి, ముగ్గురు సైనికులకు గాయాలు..

ఈ ఎన్ కౌంటర్ సమయంలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.

Self-styled JeM Kashmir chief Qari Yasir among three militants killed in Kashmir says Army (photo-ANI)

అనంత్‌నాగ్: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు మరణించాడు. ఈ ఎన్ కౌంటర్ సమయంలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కమాండర్ ను కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికులతో పాటు ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని తెలిపారు. క్షతగాత్రులను వాయు మార్గంలో శ్రీనగర్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. మరణించిన హిజ్బుల్ కమాండర్ ను నిసార్ ఖండేగా గుర్తించారు. ఓ ఏకే-47 రైఫిల్ ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.

పోలీసు ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, అనంత్‌నాగ్‌లోని రిషిపోరా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని ఆయన తెలిపారు. "గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స కోసం 92 బేస్ హాస్పిటల్ శ్రీనగర్‌కు తరలించారు. ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని పేర్కొన్నారు" అని అధికార ప్రతినిధి తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif