IPL Auction 2025 Live

Karnataka Shocker: వితంతువుపై తెగబడిన కామాంధులు, ఇంట్లోకి దూరి దారుణంగా అత్యాచారం, ఆపై మంచం మీదనే చంపేసి కాల్చివేసిన దుండగులు

వితంతు మహిళపై (Home Alone Woman) దుండగులు అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి కాల్చివేశారు. ఈ షాకింగ్‌ ఘటన మద్దూరు తాలూకా మారసింగనహళ్లిలో సోమవారం రాత్రి జరిగింది

Man thrashes wife for failing to conceive a child (Representational: Getty)

Mandya, Jan 11: కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలో (Karnataka's Mandya district)దారుణం చోటు చేసుకుంది. వితంతు మహిళపై (Home Alone Woman) దుండగులు అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి కాల్చివేశారు. ఈ షాకింగ్‌ ఘటన మద్దూరు తాలూకా మారసింగనహళ్లిలో సోమవారం రాత్రి జరిగింది. ఈ గ్రామానికి చెందిన దివంగత కుమార ఆరాధ్య భార్య ప్రేమ (42)ను హతురాలిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా బెంగళూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆమె కోడలు మండ్య మహిళా కాలేజీలో చదువుతోంది. మారసింగనహళ్లిలో టైలరింగ్‌ పనిచేస్తున్న ప్రేమ భర్త కుమార ఆరాధ్య పక్షవాతంతో మూడేళ్ల క్రితం మరణించాడు. తరువాత ప్రేమ గ్రామంలోని తన సొంతింట్లో చీటీలు నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది.

12 ఏళ్లకే గుండెపోటు, నిద్రలోనే ఉలిక్కిపడిలేచి విలవిలలాడిన చిన్నారి, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూత

సోమవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా చొరబడిన దుండగులు తల దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆమెను (Charred To Death) చంపేశారు. మంచంతో సహా మృతదేహాన్ని కాల్చివేసి పరారయ్యారు. మంగళవారం ఉదయం ప్రేమ ఇండి పడక గదిలో నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించి ఇరుగుపొరుగు వాసులు వచ్చి చూడగా ప్రేమ మరణించి ఉండడం చూసి నిర్ఘాంత పోయారు. బేసగరహళ్లి పోలీసులు జాగిలాల సహాయంతో పరిశీలించారు. హత్యకు ముందు నిందితులు పడక గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు గుర్తించారు.

లోకల్ ట్రైన్‌లో బట్టలు చినిగేలా కొట్టుకున్న ముగ్గురు మహిళలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్, సీట్ల విషయంలో గొడవ జరిగినట్లుగా వార్తలు

మండ్య మిమ్స్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడు డాక్టర్‌ పుట్టస్వామి నేతృత్వంలోని సిబ్బంది మంగళవారం సాయంత్రం ఘటన జరిగిన స్థలంలోనే పోస్టుమార్టమ్‌ నిర్వహించారు. మద్దూరు రూరల్‌ సీఐ మనోజ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎన్‌.యతీశ్, డీఎస్పీ నవీన్‌ కుమార్, పీఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు