Astrology: ఈ రోజు రాశి ఫలాలు, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశిలో ఏముందో చెక్ చేసుకోండి
ప్రతి పని మొదలుపెట్టేముందు అందరూ మంచి చెడు ఫలితాలు (Astrology) ఎలా ఉంటాయో పండితులను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన తరువాత అందరూ ముందుగా తమ రాశిఫలాలు(Astrological prediction) ఎలా ఉన్నాయి.
జ్యోతిష్యం అనేది మనలో భాగమైపోయింది. ప్రతి పని మొదలుపెట్టేముందు అందరూ మంచి చెడు ఫలితాలు (Astrology) ఎలా ఉంటాయో పండితులను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన తరువాత అందరూ ముందుగా తమ రాశిఫలాలు(Astrological prediction) ఎలా ఉన్నాయి. ఈ రోజు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది చూసుకుని తమ పనులు ప్రారంభిస్తుంటారు. ఈ రోజు రాశి ఫలాలను ఓ సారి పరిశీలిస్తే... గురువారం హిందువులు శ్రీమహా విష్ణువును కొలిచే రోజు. మరి కొందరు సాయి బాబాను కూడా కొలుస్తారు. నేటి రాశి ఫలాల్లో..ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఓ సారి చూద్దాం.
మేష రాశి : ఇవాళ బృహస్పతి అనుగ్రహం మీపై ఉంటుంది. మిత్రులతో సఖ్యత ఉంటుంది. విందు వినోదాలతో పాటు పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తులు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. భూలాభాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి ఉంటుంది. కీలక విషయాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకుంటారు. వచ్చిన అవకాశాలను మరో ఆలోచన లేకుండా సద్వినియోగం చేసుకుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమికులు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు స్నేహితుల సాయంతో మంచి జాబ్ పొందుతారు.
వృషభ రాశి: వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధువిరోధాలు ఏర్పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. అనారోగ్యం. ఇవాళంతా నిరాశజనకంగా గడుస్తుంది. అహంకారపూరితంగా వ్యవహరించడం మీకు చేటు చేస్తుంది తప్ప లాభం ఉండదు. మీ వృత్తిపరమైన జీవితంతో పాటు కుటుంబ జీవితాన్ని అది అతలాకుతలం చేస్తుంది. ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. అంతర్గతంగా అది మీకు తెలుస్తూనే ఉంటుంది. మీలోని సృజనాత్మకతను అది అడ్డుకుంటుంది.
మిథున రాశి: ఈ రాశి వారు ఇవాళ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. పనిలో బాగా రాణిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం ఏదో ఒక రూపంలో అందుతుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. తోబుట్టువులతో సంబంధాలు బలపడుతాయి. ప్రభావశీలురైన వ్యక్తులతో పరిచయాలు మీ బిజినెస్‌ను మరింత పరుగులు పెట్టించడంలో పనికొస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.
కర్కాటక రాశి: చంద్ర అనుగ్రహం మీకు కలిసొస్తుంది. అది మీకు సంతోషం కలిగేలా చేస్తుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా ఉపయోగపడుతాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. వ్యాపారపరంగా సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సన్నిహితులు మీకు అండగా నిలుస్తారు.కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి లాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.
సింహ రాశి: నూతన వ్యక్తుల పరిచయం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. చంద్ర అనుగ్రహంతో సానుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనిని హుషారుగా ముందుకు తీసుకెళ్తారు. భార్య లేదా భర్తతో రొమాంటిక్‌గా గడుపుతారు. వైవాహిక బంధం మరింత బలపడుతుంది.కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభవార్త అందుతుంది. ప్రేమికులు అనవసర విషయాలపై వాదనలకు దిగవద్దు.
కన్య రాశి : ఈ రాశి వారు ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. ఇవాళ మీరు నిరాశకు గురవుతారు. మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేనిపక్షంలో అది మీకు మరిన్ని కష్టాలు తీసుకొస్తుంది. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. లేనిపక్షంలో మీ ప్రేమ బంధంపై ఎఫెక్ట్ పడుతుంది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
తులా రాశి: ఈ రాశి వారు ఇవాళ మనశ్శాంతిగా గడుపుతారు. వ్యాపారపరంగా మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంటారు. అది మీ వ్యాపారంలో లిక్విడిటీని పెంచుతుంది. మీ సంపాదన మీ సేవింగ్స్‌ను పెంచుతుంది. భార్య లేదా భర్తతో ఎక్కువ సమయం గడుపుతారు. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధం రావొచ్చు.చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి చంద్రుడి సానుకూల ప్రభావం మీపై ఉంటుంది. గతంలో మీకు ఎదురైన నష్టాలు ఇప్పుడు లాభాలుగా మారుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఆఫీసులో పని రీత్యా ప్రశంసలు దక్కుతాయి. మీ బాస్ మీ పట్ల మంచి అభిప్రాయంతో ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ జరగవచ్చు. అవివాహితులు లేదా ప్రేమికులు పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
ధనుస్సు రాశి : ఈ రాశి వారికి పరిస్థితులన్నీ అదుపులో ఉంటాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా మీ నెట్‌వర్క్ మీకు కలిసొస్తుంది. మీ ఇల్లు లేదా ఆఫీసు కోసం కొన్ని కళాకృతులు కొనుగోలు చేసి తీసుకొస్తారు. కుటుంబంతో కలిసి సినిమాలు లేదా ఇతరత్రా వినోద కార్యక్రమాలకు వెళ్తారు. పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మకర రాశి : ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. సంపాదనకు ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ ఏర్పడుతుంది. మీ ఉద్యోగంలో మీరు బాగా రాణిస్తారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. మీ నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తారు. మీ ప్రత్యర్థులు లేదా శత్రువులు అదుపులో ఉంటారు.ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.
కుంభ రాశి : ఈ రాశి వారికి మీ ఇంటికి మరమత్తులు చేసే ఆలోచనలో ఉంటారు. ఇంటిని అందంగా అలంకరించాలని భావిస్తారు. ఇంటి గురించి మీ శ్రద్ధ మీ భార్య లేదా భర్తకు మీ పట్ల మరింత సదాభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. స్నేహితులు, సహోద్యోగులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వివాదాలకు సంబంధించి మీకు శుభవార్త ఉండొచ్చు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. దైవదర్శనాలు ఉంటాయి.
మీన రాశి : ఈ రాశి వారికి చంద్రుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. చాలాకాలంగా మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఆర్థికపరంగా అది మీరు నష్టాల నుంచి బయటపడేలా చేస్తుంది. ఇల్లు లేదా లగ్జరీ వస్తువుల కొనుగోలుకు లోన్ కోసం అప్లై చేసే అవకాశం ఉంది. రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలోపూర్తి చేస్తారు. దూరపు బం«ధువుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.
(Note: ఈ కథనం ఇంటర్నెట్లో పండితులు సూచించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది.ఈ సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. లేటెస్ట్ లీ మీడియా దీనిని ధృవీకరించలేదు. దీనికి ఎటువంటి బాధ్యత వహించదు)