Wall Collapse: హైదరాబాద్‌లో విషాదం, గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, హబీబ్‌నగర్‌ పరిధిలోని మన్‌గిరి బస్తీలో విషాద ఘటన

ఇంటి గోడకూలి (House Wall Collapse) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గీత అనే మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు మృతులు రోషిని(6), పావని(4), సారిక(4నెలలు)గా గుర్తించారు.

Wall Collapse (Representational Image/ Photo Credit: ANI)

Hyderabad, February 28: తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్‌ హబీబ్‌నగర్‌ (Habeebnagar) పరిధిలోని మన్‌గిరి బస్తీలో విషాదం నెలకొంది. ఇంటి గోడకూలి (House Wall Collapse) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గీత అనే మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు మృతులు రోషిని(6), పావని(4), సారిక(4నెలలు)గా గుర్తించారు.

విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా అఫ్జల్‌సాగర్‌ మాన్గార్‌ బస్తీకి చెందిన మిఠాయిలాల్‌ దంపతులు పునాదులు లేకుండా సిమెంట్‌, ఇటుకలతో చిన్న శ్లాబ్‌ నిర్మించుకున్నారు. ఇదే ఇప్పుడు ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఇదే ఇంట్లో గబ్బార్‌, సురేఖ దంపతులు కూడా నివాసం ఉంటున్నారు.వీరికి వరలక్ష్మీ, గీత, ఆరోల అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోడకూలిన ప్రమాదంలో ఈ ముగ్గురు కూడా గాయపడ్డారు.

రాత్రి 10 గంటల సమయంలో వంట గది దిమ్మె వేడెక్కింది. అది గదికి మధ్యలో ఉన్న గోడపై పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా పిల్లలపై పడటంతో మిఠాయిలాల్‌ దంపతుల ముగ్గురు పిల్లలూ మరణించారు. అలాగే గబ్బార్‌ దంపతుల పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నిలోఫర్‌కు తరలించారు. గబ్బార్ పిల్లల పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు నీలోఫర్‌ వైద్యులు చెబుతున్నారు.