Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం, జలమయమైన రోడ్లు, పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్
మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్‌నగర్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ప్రధాన రహదారులపై వరద నీరు చేరింది. ఆఫీసులు వదిలే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.