Hyderabad Shocker: ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్న పాడుబుద్ధి, ఏడాది నుంచి చెల్లిలిపై అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

సొంత చెల్లెలిపైనే కామాంధుడైన అన్న అఘాయిత్యానికి (Minor sister sexually abused) పాల్పడ్డ దారుణం వెలుగు చూసింది. నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Representative image

Hyd, Sep 2: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సొంత చెల్లెలిపైనే కామాంధుడైన అన్న అఘాయిత్యానికి (Minor sister sexually abused) పాల్పడ్డ దారుణం వెలుగు చూసింది. నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన కుటుంబం హిమాయత్‌నగర్‌లో స్థిరపడింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019లో బాలిక వయస్సు 16 సంవత్సరాలు. కాగా ఇంట్లో ఎవరూ లేనప్పుడు రోహన్‌ నాయుడు తన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారూ పట్టించుకోలేదు.పైగా ఆమెనే దూషించారు.

యువతిని బెడ్ రూంలోకి తీసుకెళ్లాడు, పని కోసం బట్టలు విప్పగానే అది చూసి షాక్, మిస్టరీ కేసును చేధించిన ఎంపీ పోలీసులు

దీనిని అసరగా తీసుకున్న రోహన్‌ నాయుడు చెల్లిని భయపెడుతూ అప్పటి నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు లైంగిక దాడి (for a year by Brother) చేశాడు. ఇదిలా ఉండగా జూన్‌లో బాధితురాలు నేపాల్‌కు వెళ్లి వచ్చింది. తిరిగి వచ్చి ఓ హాస్టల్లో ఉంటోంది. అయినా ఆమెను ఫోన్‌చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు ఆగస్టు 30న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రోహన్‌నాయుడుపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.