Stabbed (file image)

Indore, Sep 1: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మిస్టరీగా మారిన ట్రాన్స్‌జెండర్‌ హత్య కేసును (Madhya Pradesh mysterious death case) పోలీసులు చేధించారు. అతి తక్కువ కాలంలోనే కేసు మిస్టరిని చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు (accused arrested) చేశారు. ఎంపీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఇండోర్‌లోని పోలీసులు పొదలమాటున చిద్రమైన ట్రాన్స్‌జెండర్‌ మృత దేహాన్ని గుర్తించారు. పోలీసుల గుర్తించిన ఆ ట్రాన్స్‌జెండర్‌ మృతదేహంలో ఒక భాగం మాత్రమే (Mutilated body found in Indore) లభించింది.దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు.

ఆ పరిసర ప్రాంతాల్లో పీసీఫుటేజ్‌ని పరిశీలించగా.... చనిపోయిన ట్రాన్స్‌ జెండర్‌ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్‌ జోయా కిన్నార్‌గా గుర్తించారు. ఇక ఈ కేసులో అనుమానితుడు ఖజ్రానాకు చెందిన నూర్‌మహ్మద్‌గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతను మొదట్లో నేరం ఒప్పుకోలేదు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో షాకింగ్ విషయాలను బయటపెట్టాడు.

పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని కత్తితో దారుణంగా పొడిచి ఆత్మహత్య చేసుకున్న యువకుడు, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న యువతి

పోలీసుల విచారణలో నిందితుడు ..తన భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్‌ జోయాతో సోషల్‌ మీడియాలో చాటింగ్‌ చేసినట్లు తెలిపాడు.ఆ తర్వాత తాను జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించానని చెప్పాడు. అయితే ఇంటికి వచ్చాకే జోయా ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసిందని, దీంతో ఈ విషయమై మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు. ఆ కోపంలో తాను ఆమె గొంతుకోసి చంపినట్లు చెప్పాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి, అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి బైపాస్‌ సమీపంలోని పొదల్లోకి విసిరేసినట్లు తెలిపాడు.

మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోనే పెట్టేలో భద్రపరిచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు మిగతా భాగం మృతదేహాన్ని నిందితుడు నూర్‌మహ్మద్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.