పశ్చిమబెంగాల్ (West Bengal)లోని ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT-Kharagpur)లో విద్యార్థి తన హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య (Student suicide)కు పాల్పడ్డాడు. విద్యార్థిని కలిసేందుకు వచ్చిన అతని తల్లిదండ్రులు ఎంతసేపు తలుపుతట్టినా తీయకపోవడంతో సంస్థ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది తలుపులు విరగొట్టి చూడగా విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మృతుడిని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న షోన్ మాలిక్ గా గుర్తించారు.
ప్రముఖ బాసిస్ట్ చంద్రమౌళి బిస్వాస్ ఆత్మహత్య, సంపాదన సరిగా లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు
మాలిక్‌తో శనివారం రాత్రే ఫోన్‌లో మాట్లాడామని, అంతా బాగానే ఉందని చెప్పాడని, ఇవాళ తాము వచ్చేలోపే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందినే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇటీవలే ల్యాబ్ టెక్నీషియన్ కమ్ అసెస్టెంట్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యలపై అంతర్గత దర్యాప్తు చేపట్టినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.