
Bhopal, August 31: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుందామంటూ యువతిని అడగగా, ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు ఓ యువకుడు. దారుణ వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని 20 ఏళ్ల యువతిని.. బబ్లు అనే యువకుడు పెళ్లి చేసుకుందామంటూ వేధించసాగాడు.
ఐతే ఆ యువతి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆమె ఇంట్లో ఒంటిరిగా ఉన్నసమయంలో కత్తితో దాడి (Girl Stabbed For Rejecting Proposal) చేసి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, సదరు యువతిని చికిత్సి నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారి వివేక్ సింగ్ తెలిపారు.
ఇక నిందితుడు కోసం గాలిస్తున్న పోలీసులకు అతను ఖడ్వాలోని ఇందిరా సాగర్ డ్యామ్ సమీపంలో శవమై (Accused Found Dead) కనిపించాడని తెలిపారు. బహుశా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పక్కనే ఉన్న గ్రామంలో వాచ్‌మేన్‌గా పనిచేస్తుంటాడని బాధితురాలి సోదరి తెలిపింది. మా అక్కను పెళ్లి చేసుకోవాలని పదే పదే బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. వాళ్ల అమ్మనాన్నలు ఊరెళ్లడంతో తామిద్దరమే ఇంట్లో ఉన్నామని, ఆ సమయంలోనే బబ్లు వచ్చి అక్క పై దాడి చేసి వెళ్లిపోయాడని చెప్పింది.
తాను ఆ సమయంలో ఇంటి బయట బకెట్‌లో నీళ్లు నింపుతుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలి చెల్లెలు చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనపై తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు.