IAF Day 2020: అట్టహాసంగా భారత వైమానిక దళ 88వ వార్షికోత్సవ వేడుకలు, హైలైట్‌గా నిలిచిన రాఫెల్ యుద్ధ విమానాల విన్యాసాలు, శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని సహా ఇతర ప్రముఖులు

నింగిని మరియు విపత్కర పరిస్థితుల్లో ప్రజలను నిరంతరం కాపాడే భారత వాయుసేనకు ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు....

IAF personnel (Photo Credits: ANI)

New Delhi, October 8: భారత వైమానిక దళం ఈరోజు తన 88 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది, దిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైనాయి.

ఎయిర్ ఫోర్స్ డేను పురస్కరించుకొని భారత వైమానిక దళం ఘనమైన పరేడ్ నిర్వహించింది. ఈ పరేడ్ లో వాయుసేనకు చెందిన 56 ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి. ఇందులో తేజాస్, జాగ్వార్, సుఖోయ్ లాంటి యుద్ధ విమానాలు, అటాక్ హెలికాప్టర్లతో పాటు ఇటీవలే వాయుసేనలో చేరిన రాఫెల్ యుద్ధవిమానాలు పాల్గొనడం హైలైట్.

ఈ సందర్భంగా భారత వాయుసేన ఫైటర్ జెట్స్ ప్రదర్శించిన గగనతల విన్యాసాలు తమ పరాక్రమాన్ని ఠీవీగా చాటాయి. అతి తక్కువ రేడియస్ లోనే రాఫేల్ విమానాలు మెరుపు వేగంతో టర్న్ తీసుకోవడం, కేవలం హాకీ ఫీల్డ్ అంతటి స్థలంలోనే 8 ఆకృతిని సృష్టించడం, అలాగే మన అపాచే, ఎంఐ-35 లాంటి హెలికాప్టర్లు నిప్పులు చెరుగుతూ ఏకలవ్య ఫార్మేషన్ లో విన్యాసాలు చేయడం, వీక్షకుల రోమాలు నిక్కబొడిచేలా చేశాయి.

Watch Rafale Fighter Jets on IAF Day

Flares Fired by Eklavya Formation:

వైమానిక దళ దినోత్సవం సందర్భంగా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే ఐఏఎఫ్ యోధులకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

నింగిని మరియు విపత్కర పరిస్థితుల్లో ప్రజలను నిరంతరం కాపాడే భారత వాయుసేనకు ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.

PM Modi Tweet:

'ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా భారత వైమానిక దళ సాహస యోధులందరికీ శుభాకాంక్షలు. మీరంతా భారత గగనతలాన్ని నిరంతరం సురక్షితంగా ఉంచడమే కాకుండా, విపత్తు సమయాల్లో కూడా ప్రజలను ఆదుకుంటూ ఎంతో సేవ చేస్తున్నారు. భారతమాత రక్షణలో మీరు చూపే ధైర్యం, శౌర్యం అంకితభావం మా అందరికీ స్ఫూర్తిదాయకం" అని మోదీ అన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif