Shivraj Patil: మహాభారతంలో కూడా జిహాద్ ప్రస్తావన, శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం జిహాద్ వంటిదేనంటూ మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు, మండిపడుతున్న బీజేపీ
మహాభారతంలో కూడా జిహాద్ ప్రస్తావన ఉందని.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం జిహాద్ వంటిదే అంటూ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో కూడా జిహాద్ ప్రస్తావన ఉందని.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం జిహాద్ వంటిదే అంటూ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇస్లాం, క్రిస్టియానిటీలోనూ జిహాద్ గురించి చెప్పారని శివరాజ్ పాటిల్ అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, స్వచ్ఛమైన ఆలోచనను అర్థం చేసుకోకపోతేనే బలాన్ని ఉపయోగించాలని, ఇది ఖురాన్ తో పాటు గీతలో ప్రస్తావించబడిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ దీటుగా స్పందించింది. బీజేపీ ప్రతినిధి షెహజాద్ జైహింద్ కాంగ్రెస్‌ను హిందూ ద్వేషి అని ఆరోపించారు. రాముడి ఉనికిని వ్యతిరేకిస్తోందన్నారు.
ఈ పుస్తకావిష్కణ కార్యక్రమంలో శివరాజ్ పాటిల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్, ఫరూర్ అబ్ధుల్లా తదితరులు పాల్గొన్నారు.మాజీ కేంద్ర మంత్రి మోషినా కిద్వాయ్ బయోగ్రఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో శివరాజ్ పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. పలువురు బీజేపీ నాయకులు మాజీ మంత్రిపై మండిపడుతున్నారు. శివరాజ్ పాటిల్ వైఫల్యాలను గుర్తుచేస్తున్నారు.కాంగ్రెస్ చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు పాటిల్ వ్యాఖ్యలు నిదర్శనమని బీజేపీ విమర్శించింది
Here's Videos
బీజేపీ వ్యాఖ్యలపై మాజీ హోం మంత్రి స్పందించారు. మహాత్మా గాంధీని చంపితే అది జిహాద్. అతన్ని చంపడమే జిహాద్" అని అన్నారు. నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కృష్ణుడు అర్జునుడికి జిహాద్ పాఠాలు బోధించాడు, "అది నువ్వే జిహాద్ అంటున్నావు. కృష్ణుడి పాఠాలను అర్జునుడికి జిహాద్ అంటావా? కాదు, అదే నేను చెప్పానని అన్నారు.